చెప్పులేసుకుందని విమర్శలు.. ట్రోలర్స్ కి సమాధానం చెప్పిన శిల్పా శెట్టి..!

By telugu news team  |  First Published Aug 16, 2023, 10:29 AM IST

తాజాగా ఆమె తన భర్త రాజ్ కుంద్రా, కుమారుడు వియాన్, కుమార్తె సమీషా, తల్లి సునంద శెట్టితో కలిసి భారత స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.


బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులోనూ హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక శిల్పా శెట్టి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో, ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయంలను కూడా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు.

తన పర్సనల్ విషయాలను కూడా ఆమె సోషల్ మీడియాలో ఉంచడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన భర్త రాజ్ కుంద్రా, కుమారుడు వియాన్, కుమార్తె సమీషా, తల్లి సునంద శెట్టితో కలిసి భారత స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Latest Videos

ఈ వీడియోలో శిల్పా తెల్లటి కుర్తాలో కనిపించింది, ఆమె ఆకుపచ్చ సల్వార్ బాటమ్, నారింజ దుపట్టాతో పెయిర్ చేశారు. నటి తన పిల్లలు,  భర్తతో కలిసి భారత జెండాను ఆవిష్కరించింది.

undefined

అయితే, ఆమె వీడియోని షేర్ చేసిన తర్వాత, జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు బూట్లు ధరించి ఉండటంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  ఒక ఇంటర్నెట్ వినియోగదారు శిల్పా పోస్ట్‌పై  "మీరు జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు, మీ పాదరక్షలను తీసివేసిన తర్వాత మాత్రమే జెండా  తాడును తాకాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను" అని రాశారు. అంతే, అందరూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నియమాలు పాటించలేదు అని విమర్శించారు.

 

కాగా, ఈ ట్రోల్స్ పై తాజాగా శిల్పా శెట్టి స్పందించారు. ట్రోలర్స్ అందరికీ గట్టిగా సమాధానం ఇచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల  గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె పేర్కొన్నారు. చెప్పులేసుకోకూడదన్న నియమం  ఎక్కడా లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆమె గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ నెట్టింట షేర్ చేయడం గమనార్హం. ట్రోలర్లు తమ అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించడం, ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడాన్ని అస్సలు మంచిది కాదు అని ఆమె ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

click me!