శౌర్యచక్ర అవార్డ్ గ్రహీత బల్వీందర్ సింగ్ దారుణహత్య

By Siva KodatiFirst Published Oct 17, 2020, 5:00 PM IST
Highlights

ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంగా నిలిచి శౌర్యచక్ర పురస్కారాన్ని అందుకున్న బల్వీందర్ సింగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. 

ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంగా నిలిచి శౌర్యచక్ర పురస్కారాన్ని అందుకున్న బల్వీందర్ సింగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని తరణ్ జిల్లాలోని ఖిఖివింద్ గ్రామంలో తన నివాసం పక్కనే వున్న కార్యాలయంలో ఉండగా.. మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు.

ఉగ్రవాదులు ఆయన్ని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో ఏడాది కిందట ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని తగ్గించింది.

ఉగ్రవాదుల‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన బల్వీందర్ సింగ్‌కు పంజాబ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దారుణంగా హత్యకు గురవడం పంజాబ్ వాసులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

మరోవైపు తర్న్ తరణ్ జిల్లా పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం బల్వీందర్ సింగ్‌కు కల్పించిన భద్రతను ఉపసంహరించిందని ఆయన సోదరుడు రంజిత్ మీడియాకు తెలిపారు.

తమ కుటుంబ సభ్యులందరూ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 1993లో బల్వీందర్ సింగ్‌కు శౌర్య చక్ర ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. 

click me!