భారతదేశపు తొలి స్త్రీవాది అంబేద్కర్: శశి థరూర్

Published : Nov 20, 2022, 05:45 PM IST
భారతదేశపు తొలి స్త్రీవాది అంబేద్కర్: శశి థరూర్

సారాంశం

భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కు చాలా ముందుచూపు ఉందనీ, ఆయన భారతదేశపు తొలి పురుష స్త్రీవాది అని  కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు (ఎంపి) శశి థరూర్ శనివారం అన్నారు. గోవా హెరిటేజ్ ఫెస్టివల్‌లో థరూర్ తన తాజా పుస్తకం 'అంబేద్కర్: ఎ లైఫ్' గురించి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్త్రీవాద ఆలోచనను నేటికీ సమాజం అంగీకరించలేదని అన్నారు.

భారతదేశపు తొలి స్త్రీవాది డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ఆయన 1920,30,40 దశకాలలో మహిళా ప్రేక్షకుల ముందు ప్రసంగాలు చేసేవాడు. నేడు ఇలా చేసే నాయకులను ప్రగతిశీలులుగా పరిగణిస్తున్నారు.  శనివారం నాడు ఆయన గోవా హెరిటేజ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  తన పుస్తకం 'అంబేద్కర్: ఎ లైఫ్' గురించి మాట్లాడారు. అంబేద్కర్ స్త్రీవాద ఆలోచనను నేటికీ సమాజం అంగీకరించలేదని అన్నారు. 

మహిళా కార్మికుల కోసం అంబేద్కర్ పోరాటం..

బలవంతంగా మహిళలకు పెళ్లిళ్లు చేసుకోవద్దని అంబేద్కర్ చెప్పారని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. మహిళలు తమ ఇష్టానుసారం సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని, ప్రసవాన్ని ఆలస్యం చేయాలని, భర్తకు అండగా నిలవాలని కోరారని తెలిపారు. బొంబాయి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  ఆయన మహిళా కార్మికులు, కూలీల కోసం పోరాడారనీ, నెల రోజుల కష్టమైనా తమకు ఎక్కువ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని తెలిపారు.

 మహిళల గొంతుకగా అంబేద్కర్

అంబేద్కర్ 1938లో మహిళల కోసం ఒక బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించారు, అందులో ప్రభుత్వ నిధులతో జనన నియంత్రణ కోసం ప్రచారం చేయాలనే చర్చ జరిగింది. అయితే  ఈ బిల్లు  పాస్ కాలేదు. 1975లో అమెరికాలో భారత్ ఇమేజ్ చాలా దారుణంగా ఉండేదనీ, కానీ ఆ తర్వాత భారత్ వేగంగా అభివృద్ది పథంలోకి వచ్చిందని అన్నారు.

నేడు అమెరికాలోని పరిస్థితులను, భారత్‌లో వైవాహిక అత్యాచార చట్టంపై జరుగుతున్న చర్చను గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం అంబేద్కర్ తన గళాన్ని వినిపించాడనే విషయం తెలుస్తుందని అన్నారు. మహిళల సమస్యలను ఎవరూ పట్టించుకోని సమయంలో అంబేద్కర్ వారికి అండగా నిలిచారని, సమాజంలో స్త్రీల హక్కులు పురుడు పోశారని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి విఘాతం కలుగుతుందని అగ్రవర్ణాలు భావించినప్పుడు అంబేద్కర్ దళితుల హక్కుల గురించి మాట్లాడారని తెలిపారు.    

తనపై చేస్తున్న ట్రోలర్లపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విరుచుకుపడ్డారు. వాస్తవానికి  ఓ అమ్మాయి థరూర్‌తో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై ట్రోలర్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. దీంతో కలత చెందిన యువతి ఆ పోస్ట్‌ను తొలగించింది. అదే సమయంలో శశిథరూర్ విరుచుకుపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం