'ఇదో ఆశాకిరణం.. ప్రతిపక్ష ఐక్యతకు నాంది.. ':రాహుల్ అనర్హత వేటుపై శశి థరూర్ స్పందన

By Rajesh KarampooriFirst Published Mar 26, 2023, 11:03 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఆ పార్టీ నాయకుడు శశి థరూర్ తనదైన శైలిలో స్పందించారు.  మునుపెన్నడూ లేని విధంగా విపక్షాల ఐక్యతను ప్రదర్శించడం వల్లే తనకు ఆశాకిరణం కనిపిస్తోందని అన్నారు.

రాహుల్ గాంధీ అనర్హత వేటుపై శశి థరూర్ స్పందన: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీకి రెండేండ్లు జైలుశిక్ష పడి, లోక్ సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే.. ఈ విషయం రాజకీయాలను షేక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీపై ప్రతిపక్షలు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని విప్పాయి. విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ తరుణంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలోనూ ఈ నిరసన పర్వం శాంతించే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో.. ఈ విషయంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ తనదైన శైలిలో స్పందించారు. అనర్హత విషయంపై ప్రతిపక్షాలు ఏకమై.. ఒకే తాటిపైకి వచ్చాయని, ఇదో రకంగా.. అపూర్వ ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు నాంది అని అన్నారు. 

ఇదో ఆశ కిరణం 

మునుపెన్నడూ లేని విధంగా విపక్షాల ఐక్యతను ప్రదర్శించడం వల్లే తనకు ఆశాకిరణం కనిపిస్తోందని అన్నారు. ఎన్డీటీవీ అనే ఆంగ్ల వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ముందు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష పార్టీలే.. కానీ ఇలాంటి సమయాల్లో అవన్నీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయని అన్నారు. 

శశి థరూర్ ఏం చెప్పారు?

ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌, బెంగాల్‌లో మమతా బెనర్జీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీకి మద్దతివ్వడం మనం చూశామనీ, వీళ్లంతా గతంలో కాంగ్రెస్‌కి ప్రతిపక్ష పార్టీలనీ, గతంలో ఏ విషయంలో కూడా అండగా, మద్దతుగా లేరని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం  కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు అతిపెద్ద శక్తిగా అవతరించిందన్నారు.

బీజేపీ ఓబీసీ రాజకీయాలపై శశిథరూర్ ఫైర్ 

మరోవైపు.. బీజేపీ OBC రాజకీయాలపై, శశి థరూర్ మాట్లాడుతూ.. “తాను వెనుకబడిన తరగతికి చెందినవాడినని చెబుతూ... OBCలపై దాడి చేశారని వ్యాఖ్యానించారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. లలిత్ మోడీ వెనుకబడి ఉన్నారా? నీరవ్ మోడీ వెనుకబడి ఉన్నారా? అని బీజేపీని నిలాదీశారు. వారంతా తమ అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి , పరాయి దేశంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ వ్యక్తుల గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా చెప్పారు. రాహుల్ గాంధీ కేసులో మాకు బలమైన టీమ్ ఉందని, పిటిషనర్ దాఖలు చేసిన కేసు అంత బలంగా లేదని ఆయన అన్నారు.

"వారు వెనుకబడిన తరగతులకు చెందినవారు అని చెప్పడం, OBCలపై దాడి అనే వ్యాఖ్య ఇంగితజ్ఞానాన్ని విస్మయానికి గురిచేస్తోందని, ఆయన (రాహుల్ గాంధీ) ఈ ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకంగా సూచిస్తున్నారు. "దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది" అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. అతనికి రెండేళ్ల జైలు శిక్ష, పార్లమెంట్ నుండి అనర్హత వేటు వేసింది. గుజరాత్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పీల్ దాఖలు చేయడానికి 30 రోజుల సమయం ఇచ్చిందని మండిపడ్డారు.  

click me!