హాకీ గోల్ కీపర్ పై మోదీ ప్రశంసలు.. శశిథరూర్ వెటకారం..!

Published : Aug 07, 2021, 09:58 AM IST
హాకీ గోల్ కీపర్ పై మోదీ ప్రశంసలు.. శశిథరూర్ వెటకారం..!

సారాంశం

ప్రధాని మోదీ దృష్టిలో దేశాన్ని శత్రువుల నుంచి కాపాడేవారికంటే.. ప్రత్యర్థి టీమ్ పై గోల్స్ చేయడమే గొప్ప విషయంటూ వెటకారంగా స్పందించడం గమనార్హం.  

భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలంపిక్స్ లో అదరగొట్టింది. దాదాపు 41 సంవత్సరాల తర్వాత.. హాకీలో భారత్ కి పతకం దక్కింది. ఈ సంఘటన అందరినీ ఎంతో ఆనందానికి గురి చేసింది. ఈ క్రమంలో.. ఈ జట్టులోని సభ్యులందరినీ ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసంసించారు. కాగా... ఈ జట్టులోని గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కి కూడా మోదీ ప్రశంసలు తెలియజేయగా.. ఆ ట్వీట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కన్ను పడటం గమనార్హం.

ప్రధాని మోదీ దృష్టిలో దేశాన్ని శత్రువుల నుంచి కాపాడేవారికంటే.. ప్రత్యర్థి టీమ్ పై గోల్స్ చేయడమే గొప్ప విషయంటూ వెటకారంగా స్పందించడం గమనార్హం.

‘ శ్రీజేష్.. భారతదేశం పతకం సాధించడంలో మీరు కీలక పాత్ర పోషించారు. మీకు అభినందలు, శుభాకాంక్షలు’ అంటూ... గోల్ కీపర్  శ్రీజేష్ ని ఉద్దేశించి మోదీ ట్వీట్ చేశారు. జర్మనీతో జరిగిన మ్యాచ్ లో శ్రీజేష్.. అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. అతని కారణంగానే జట్టు విజయతీరాలకు   చేరుకుంది. ఈ నేపథ్యంలో మోదీ అభినందనలు తెలియజేశారు.

ఈ ట్వీట్ పై శశిథరూర్ స్పందిస్తూ.. శ్రీజేష్ పై ప్రధానమంత్రి ప్రశంసలు కేరళలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని సంతోషరిచాయంటూ పేర్కొనడం గమనార్హం.

శ్రీజేష్.. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో జన్మించారు. హాకీ జట్టు గోల్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో కెప్టెన్ గా కూడా విధులు నిర్వహించాడు. మ్యాచ్ చేజారిందనుకున్న సమయంలో..  శ్రీజేష్.. తన ఆటతీరుతో గేమ్ ని మార్చేశాడు. చివరకు విజయం గెలిచేలా చేశాడు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌