
2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించడం అసాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ 50 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని థరూర్ పేర్కొన్నారు. శనివారం నాడు కోజికోడ్ లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 2019 ప్రదర్శనను బీజేపీ ప్రదర్శించడం అసాధ్యమని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రస్తుతం ఉన్న 50 సీట్లను కోల్పోవచ్చు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ సాధించదనీ అన్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చునని అన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి పనితీరు కనబరిచిందో.. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన చేసింది. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఆ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది, అయితే 2024లో బీజేపీ గత ఎన్నికల మాదిరిగా ఫలితాలు సాధించడం అసాధ్యం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోవచ్చని అన్నారు. 2019 ఎన్నికల విజయాన్ని పునరావృతం చేయడం బీజేపీకి అసాధ్యమని శశిథరూర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆ ఫలితాలన్నింటినీ పునరావృతం చేయడం అసాధ్యం, 2024లో మెజారిటీ కంటే దిగువకు పడిపోయే అవకావముందని అన్నారు.
'పుల్వామా, బాలాకోట్‌ల ప్రయోజనం'
పుల్వామా దాడులు, బాలాకోట్ దాడులను ప్రస్తావిస్తూ.. ఆఖరి క్షణంలో బీజేపీ విపరీతమైన అలజడికి ఈ ఘటనలే కారణమని అన్నారు. ఇది 2024లో పునరావృతం కాదు. అయితే.. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడిస్తాయా అనే ముఖ్యమైన ప్రశ్నపై? సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. సమాధానం చెప్పలేమని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 250 సీట్లు, ఇతర పార్టీలకు 290 సీట్లు వస్తే.., 290 సీట్లు వచ్చే పార్టీలు కలిసి రావడానికి అంగీకరిస్తాయో లేదో మనకు తెలియదని థరూర్ అన్నారు.
75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి థరూర్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో వంశపారంపర్యమే సవాల్ అని, తమ పార్టీని చీల్చే వారు కూడా దేశం చుట్టూ చూడాలని అన్నారు. ప్రతి పార్టీలో వంశపారంపర్య రాజకీయాలు ఉన్నాయనీ.. యుపి మాజీ సిఎం దివంగత ములాయం సింగ్ యాదవ్ నుండి లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి, బాల్ థాకరే, రాజకీయ నాయకుల కుమారులు లేదా మేనల్లుళ్లందరూ నేడు తమ పార్టీకి వారసులేనని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 303 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 52 మాత్రమే గెలుచుకోగలిగింది.