మకరమేళాలో తొక్కిసలాట ..మహిళ మృతి.. పలువురికి తీవ్రగాయాలు.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Published : Jan 14, 2023, 11:54 PM IST
మకరమేళాలో తొక్కిసలాట ..మహిళ మృతి.. పలువురికి తీవ్రగాయాలు.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

సారాంశం

ఒడిశాలోని కటక్ జిల్లాలో శనివారం జరిగిన మకర్ మేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మహిళ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

ఒడిశా మకరమేళాలో తొక్కిసలాట: ఒడిశాలోని ప్రసిద్ధ మకరమేళాకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బరాంబ-గోపీనాథ్‌పూర్‌ టీ-బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దాదాపు డజను మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ బంధువులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందినట్లు బదాంబ-నర్సింగ్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేబీ ప్రసాద్ మిశ్రా ధృవీకరించారు. ఈ ఘటనలో 45 ఏళ్ల అంజనా స్వైన్ మృతి చెందిందని, తీవ్రంగా గాయపడిన నలుగురిని కటక్ నగరంలోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారని ఆయన చెప్పారు. గాయపడిన మిగతా వారిని బాదంబాలోని కమ్యూనిటీ సెంటర్‌లో చేర్చినట్లు మిశ్రా తెలిపారు. సింఘ్‌నాథ్‌ దర్శనానికి వచ్చిన మహిళలు, చిన్నారులతో సహా భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో జాతరలో ఈ ఘటన చోటుచేసుకుందని అథాఘర్‌ డిప్యూటీ కలెక్టర్ హేమంత్‌ కుమార్‌ స్వైన్‌ తెలిపారు.

ఈ ఘటనపై డిప్యూటీ కలెక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. మకరమేళాకు సుమారు 2 లక్షల మంది తరలివచ్చారని, ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.  దీంతో కొంత మందికి గాయాలయ్యాయని చెప్పారు. అయితే జనాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు.  

రెండేళ్ల తరువాత ఆలయానికి భక్తులు 

కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి వచ్చారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉందని జిల్లా యంత్రాంగం తెలిపింది. కటక్, ఖుర్దా, పూరీ, అంగుల్, ధెంకనల్, బుద్ధ్,నయాగఢ్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని యంత్రాంగం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు