కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడా? ఆ టాప్ సీక్రెట్‌పై శశిథరూర్ ఇలా స్పందించాడు.. !

Published : Apr 02, 2022, 01:53 PM IST
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడా? ఆ టాప్ సీక్రెట్‌పై శశిథరూర్ ఇలా స్పందించాడు.. !

సారాంశం

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడా? నిన్నటి ట్వీట్లు చూస్తే ఔననే అనిపిస్తుంది. ఓ ఫిలిం రైటర్ జైలర్ అనే సినిమాలోని స్టిల్‌ను పోస్టు చేసి శశిథరూర్ 9 హిందీ, మలయాళం సినిమాల్లో నటించారని పేర్కొన్నారు. దానికి శశిథరూర్ స్పందిస్తూ.. ఔను ఈ సీక్రెట్‌ను తాను ఎప్పటికీ బయట పెట్టాలని భావించలేదని వివరించారు. తాజాగా, ఈ ట్వీట్లపై వారిద్దరూ స్పందించి మరింత క్లారిటీ ఇచ్చారు.  

న్యూఢిల్లీ: ఫిలిమ్ రైటర్ వైభవ్ విశాల్ నిన్న పోస్టు చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశం అయింది. అందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అందాజ్ అప్నా అప్నా సినిమాలో నటించలేదని, కానీ, ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడని పేర్కొన్నారు. శశిథరూర్ స్క్రీన్ నేమ్ మాస్టర్ గ్యాన్‌ అని వివరించారు. ఆయన 9 హిందీ, మలయాళం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడని తెలిపారు. జైలర్ సినిమాలో నటి గీతా బాలితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శశిథరూర్‌ను చూడవచ్చు అంటూ ఆ సినిమా స్టిల్‌ను వైభవ్ విశాల్ ట్వీట్ చేశారు. ఈ రోజు ఆ పాత చిత్రాన్ని గుర్తు చేసుకోవడం సముచితం అని పేర్కొన్నారు. ఆ తర్వాత రెస్పాండ్ కావాలని శశిథరూర్‌కు సంకేతం ఇచ్చారు.

ఈ ట్వీట్‌కు రెస్పాండ్ అవుతూ, ఈ రహస్యాన్ని తాను ఎప్పటికీ దాచే ఉంచాలని భావించారని శశిథరూర్ పేర్కొన్నారు. వైభవ్ విశాల్ అద్భుతంగా రీసెర్చ్ చేసి నన్ను కనిపెట్టేశారు అని ప్రశంసించారు. అంతేకాదు, ఇప్పటికీ తనను మాస్టర్ గ్యాన్‌గానే గుర్తుంచుకునేవారు ఉన్నారని వివరించారు. ఈ ట్వీట్ల వ్యవహారం నిన్న మొత్తం జరిగింది. అయితే, ఈ రోజు వారిద్దరూ మరోసారి కూడబలుక్కున్నట్టుగానే మళ్లీ ఆ చిత్రంపై స్పందించారు.

నిన్న ఏప్రిల్ 1వ తేదీ కాబట్టి, ఆ చిత్రాన్ని పోస్టు చేసి అందరినీ ఆటబట్టించే ప్లాన్ చేసినట్టు వారు ఈ రోజు బయటపెట్టారు. తమ సంభాషణలను నిజంగానే అని తీసుకున్న నెటిజన్ల కోసం అంటూ పేర్కొని.. ఇది కేవలం జోక్ మాత్రమేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివరించారు. ఈ ఏప్రిల్ ఫూల్స్ డేలో భాగంగా ప్లాన్‌లోకి తనను లాగుతుంటే.. తాను అందుకు సహకరించానని తెలిపారు. నిన్నటి రోజును గుర్తుకు తెచ్చుకోండని పేర్కొంటూ ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.

కాగా, వైభవ్ విశాల్ కూడా నిన్నటి ట్వీట్లపై క్లారిటీ ఇచ్చారు. ఈ ట్వీట్లపై స్పందించినవారికి సారీ అని చెబుతూ.. వారంతా ఏప్రిల్ ఫూల్ అయ్యారని పేర్కొన్నారు. శశిథరూర్ తన రాజకీయాల్లోనే మంచి పాత్ర పోషిస్తున్నారని, దానికి మించి ఆయన మరే చిత్రంలోనూ నటించలేదని తెలిపారు.

నిన్నటి ట్వీట్లపై కొందరు ట్విట్టర్ యూజర్లూ షార్ప్‌గా రియాక్ట్ అయ్యారు. జైలర్ సినిమా నిజానికి 1958లో విడుదలైందని, అప్పుడు శశిథరూర్ వయసు కేవలం రెండు సంవత్సరాలేనని ట్వీట్ చేశారు. కాగా, ఓ యూజర్ ఆ స్టిల్ అసలు జైలర్ సినిమాలోది కాదని, ఫెర్రీ అనే 1954లోని సినిమా అని వివరించారు. శశిథరూర్ 1956లో జన్మించారు. 

శశిథరూర్ పేరును సినిమాలకు ఆపాదించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన అందాజ్ అప్నా అప్నా అనే సినిమాలో నటించినట్టు చర్చ జరిగింది. బస్ సీన్‌లో ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల వెనుక కూర్చున్న వ్యక్తి శశిథరూర్‌నే అని కొందరు వాదించారు. కానీ, అది అసత్యమే.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu