శరద్ పవార్ కు అస్వస్థత.. మార్చి 31న శస్త్రచికిత్స.. !

By AN TeluguFirst Published Mar 29, 2021, 12:45 PM IST
Highlights


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ పొత్తి కడుపు నొప్పితో ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ పొత్తి కడుపు నొప్పితో ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. 

శరద్ పవార్ పిత్తాశయ వ్యాధితో బాధపడుతున్నారని, మార్చి 31 న దీనికి ఆపరేషన్ చేయనున్నట్లు ఆయన పార్టీ అధికారికంగా ప్రకటించింది. 80 యేళ్ల ఈ కురువృద్ధుడు, మాజీ కేంద్ర మంత్రి క్యాన్సర్ ను జయించారు. 2004లో క్యాన్సర్ శస్త్రచికిత్స చేశారు.

ఈ విషయాన్ని ఎన్‌సిపి ప్రతినిధి నవాబ్ మాలిక్ ఈ రోజు ట్వీట్ చేశారు. ‘పవార్ నిన్న సాయంత్రం తన పొత్తికడుపులో నొప్పితో బాధపడ్డారు. దీంతో చెకప్ చేయించుకున్నారు. వైద్యులు ఆయనపిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయని తెలిపారు. కనుగొన్నారు. ఆయన ఆరోగ్యం మీద తదుపరి సమాచారం అందేవరకు కార్యక్రమాలన్నీ రద్దు చేయబడ్డాయి’ అని మాలిక్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం పవార్ రక్తం పలుచబడే మందులు వాడుతున్నారని.. అయితే తాజా ఆరోగ్య సమస్యల నేపథ్యంలో వీటిని ఆపేశారని తెలిపారు.  2021 మార్చి 31 న ఆయన్ని ఆసుపత్రిలో చేర్చనున్నారు. ఆ రోజు పవార్ కి ఎండోస్కోపీ, శస్త్రచికిత్స చేస్తారని అప్పటి వరకు ఆయన కార్యక్రమాలన్నీ రద్దు చేయబడతాయి, అని ఎన్‌సిపి ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అగాడి ప్రభుత్వం ఓ పెద్ద సంక్షోభంలో ఉన్న సమయంలో పవార్ అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సిపి ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. 

14 నెలల సంకీర్ణ ప్రభుత్వాన్ని ముఖేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసు కల్లోలంలో పడేసింది. రాష్ట్ర హోంమంత్రి, ఎన్‌సిపి లీడర్ అనిల్ దేశ్‌ముఖ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇదిలావుండగా, పవార్ శనివారం అహ్మదాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై షా ఏమీ స్పందించలేదు. కాగా ఎన్ సీపీ మాతరం అటువంటి సమావేశం జరగలేదని ఎన్‌సిపి కొట్టివేసింది. 

click me!