మైనర్ బాలికపై అత్యాచారం.. బాధితురాలు, నిందితులను కట్టేసి..

Published : Mar 29, 2021, 11:28 AM ISTUpdated : Mar 29, 2021, 11:59 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం.. బాధితురాలు, నిందితులను కట్టేసి..

సారాంశం

గిరిజనుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. కాగా.. ఆ ప్రాంతానికి చెందిన 16ఏళ్ల మైనర్ బాలికపై 20ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. బాధిత బాలికతోపాటు.. ఆమె పై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని కూడా తాళ్లతో కట్టేసి దాడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆలీరాజ్ పూర్ జిల్లాలో గిరిజనుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. కాగా.. ఆ ప్రాంతానికి చెందిన 16ఏళ్ల మైనర్ బాలికపై 20ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక కుటుంబసభ్యులకు తెలియడంతో.. నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు.

నిందితుడితోపాటు.. బాధిత బాలికను కూడా అదే  చెట్టుకు కట్టేసి దాడి చేయడం బాధాకరం. వారిని దారుణంగా కొడుతూ.. జై భారత మాతాజీ కీ జై అంటూ నినాదాలు చేయడం గమనార్హం.   ఇద్దరిపై దాడి చేస్తూ దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. వీడియో వ్యవహారం కాస్త పోలీసులకు చేరడంతో. వారు దర్యాప్తు  చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి  ఆరుగురి పై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?