
తాజ్ మహల్ నిర్మించేటప్పుడు షాజహాన్ టెండర్లను వేయలేదని గోవా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి గోవింద్ గౌడే తెలిపారు. ఆ నిర్మాణం అందుకే అంత అందంగా ఉందని చెప్పారు. రాజధాని పనాజీలోని కళా అకాడమీ భవన్ పునరుద్ధరణకు రూ.49 కోట్ల వర్క్ ఆర్డర్ కేటాయించడంపై గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP) చీఫ్, ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఆర్డర్ ను కేటాయించేటప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్ కొన్ని విధానాలను ఎందుకు దాటివేసిందో చెప్పాలని కోరారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బిడ్డ, కేరీర్‌లలో ఏదో ఒకటి ఎంచుకోమని తల్లిని అడగకూడదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు
ప్రతిష్టాత్మక కళా అకాడమీ భవనం పునరుద్ధరణ పనులకు కేటాయింపుల విషయంలో రాష్ట్ర కళా, సాంస్కృతిక శాఖ మంత్రి గోవింద్ గౌడ్ తన శాఖ చర్యను సమర్థించారు. తాజ్ మహల్, షాజహాన్‌లను ఉదహరిస్తూ విచిత్రమైన ప్రకటన చేశారు. ‘‘ తాజ్ మహల్ ఎల్లప్పుడూ అందంగా ఉంటుంది. ఎందుకంటే షాజహాన్ దానిని ఆగ్రాలో నిర్మించడానికి ఎలాంటి టెండర్ వేయలేదు’’ అని అన్నారు. తాజ్ మహల్ 390 సంవత్సరాలుగా అందంగా ఉందని, తాజ్ మహల్ నిర్మించేటప్పుడు షాజహాన్ దాని కోసం టెండర్ అడగలేదని అన్నారు. తన తోటి శాసన సభ్యులు అందరూ ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసి ఉంటారని అన్నారు. దీని నిర్మాణం 1632లో మొదలు పెట్టారని, అది 1653లో పూర్తయ్యిందని చెప్పారు. కానీ నేటికి అది చెక్కు చెదరకుండా ఎంతో అందంగా కనిపిస్తుందని చెప్పారు. 390 సంవత్సరాలు అది అలాగే ఉందని అన్నారు.
Heavy rainfall: దంచి కొడుతున్న వానలు.. ఇలాగే కొనసాగుతాయన్న ఐఎండీ
ఈ సమావేశాల సందర్భంగా విజయ్ సర్దేశాయ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ఆరోపణలు చేశారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మాన్యువల్‌ను ఉల్లంఘించి టెక్టన్ బిల్డ్‌కాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆ శాఖ పునరుద్ధరణ పనులను ఇచ్చిందని సర్దేశాయ్ అననారు. పునరుద్ధరణ పనులకు ఎలాంటి టెండర్లు వేయలేదని చెప్పారు. పునరుద్ధరణ పనుల ఎస్టిమేషన్ కేవలం ఒక్క పేజీలోనే ఉందని అన్నారు. వర్క్ ఆర్డర్ పంపిన రోజునే కాంట్రాక్టర్ ఇతర రాష్ట్రం నుంచి అంగీకారం పంపడం వంటి పనులు చాలా పనులు త్వరగా జరిగిపోయాయని అన్నారు. దీనికి మంత్రి అభ్యంతరం వ్యక్త చేస్తూ.. ఎమ్మెల్యే సర్దేశాయ్ గోవా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా..ప్రతిష్టాత్మక కళా అకాడమీని లెజెండరీ ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా రూపొందించారు