బిడ్డ, కేరీర్‌లలో ఏదో ఒకటి ఎంచుకోమని తల్లిని అడగకూడదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు

Published : Jul 14, 2022, 10:21 AM IST
బిడ్డ, కేరీర్‌లలో ఏదో ఒకటి ఎంచుకోమని తల్లిని అడగకూడదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు

సారాంశం

బాంబే హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మహిళను.. ఆమె బిడ్డ, కేరీర్‌‌ను ఏదో ఒకదానిని ఎంచుకోమని అడగకూడదని అని హైకోర్టు పేర్కొంది. ఓ మహిళ తన కూతురుతో కలిసి పోలాండ్‌కు వెళ్లేందుకు అనుమతించింది. 

బాంబే హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మహిళను.. ఆమె బిడ్డ, కేరీర్‌‌ను ఏదో ఒకదానిని ఎంచుకోమని అడగకూడదని అని హైకోర్టు పేర్కొంది. ఓ మహిళ తన కూతురుతో కలిసి పోలాండ్‌కు వెళ్లేందుకు అనుమతించింది. ఆమె కూతురుతో కలిసి పోలాండ్‌కు వెళ్లకుండా నిషేధిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. వివరాలు.. తన తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి పోలాండ్‌లోని క్రాకోవ్‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సదరు మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ భారతీ డాంగ్రేతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. 

ఆ మహిళ పూణఎలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. మహిళ పనిచేస్తున్న కంపెనీ ఆమె పోలాండ్‌లో ప్రాజెక్టు ఆఫర్ చేసింది. అయితే ఇలా జరిగితే కూతురును తన నుంచి దూరం చేసినట్టుగా అవుతుందని ఆమె భర్త ఆరోపించాడు. తండ్రీకూతుళ్ల బంధాన్ని విచ్ఛిన్నం చేయడాని ఆమె ఇలా చేస్తుందని పేర్కొన్నాడు. ఈ సందర్బంగా పొరుగు దేశాలైన ఉక్రెయిన్, రష్యాల యుద్దం కారణంగా పోలాండ్‌లో కొనసాగుతున్న పరిస్థితిని కూడా ఆమె భర్త తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు.

అయితే ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ భారతీ డాంగ్రే.. ‘‘కూతురికి, ఆమె తండ్రికి మధ్య ఉన్న ప్రేమ అంత ప్రత్యేకమైనది ఏది ఉండదు.. ఉండబోదు’’ అని పేర్కొన్నారు. అయితే మహిళ కెరీర్ అవకాశాలను కాదనలేమని చెప్పారు. ఇప్పటి వరకు కుమార్తె సంరక్షణ బాధ్యత బిడ్డను ఒంటరిగా పెంచిన తల్లి వద్దే ఉందని.. బాలిక వయస్సును పరిగణనలోకి తీసుకుని ఆమె తల్లితో పాటు వెళ్లడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. 

అదే సమయంలో మహిళ కెరీర్ అవకాశాలతో పాటు తండ్రి, కుమార్తెల మధ్య బంధం మధ్య సమతుల్యతను సాధించాలని కోర్టు నిర్ణయించింది. ముఖ్యంగా తల్లి, తండ్రి ఇద్దరి ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటించాలని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని కోర్టు పేర్కొంది. అయితే..బాలిక తండ్రికి భౌతిక, వర్చువల్ యాక్సెస్ ఇవ్వాలని సదరు మహిళను కోర్టు ఆదేశించింది. తండ్రి.. కూతురిని కలిసేందుకు వీలుగా సెలవులు ఉన్న సమయంలో మహిళా భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంటుందని చెప్పింది. 

ఇక, ఈ కేసుతో సంబంధం ఉన్న జంట 2010లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి కూతురు పుట్టింది. కానీ ఇప్పుడు ఇంట్లో గొడవల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. విడాకులు కోసం ఆ మహిళ ఇప్పటికే ఫ్యామిలీ కోర్టులో కూడా దరఖాస్తు చేసుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు