తమిళనాడులో అమానుషం... మైనర్ బాలుడిపై కామాంధుడి లైంగిక వేధింపులు

Published : Jun 05, 2023, 05:36 PM ISTUpdated : Jun 05, 2023, 05:44 PM IST
తమిళనాడులో అమానుషం... మైనర్ బాలుడిపై కామాంధుడి లైంగిక వేధింపులు

సారాంశం

అభం శుభం తెలియని అమాయక బాలుడిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి ప్రయత్నించిన అమానుషం తమిళనాడులో చోటుచేసుకుంది. 

చెన్నై : అమ్మాయిలనే కాదు అబ్బాయిలనూ వదిలిపెట్టడం లేదు కొందరు నీచులు. ఒంటరిగా బయటకు వెళితే చాలు ఆడ, మగ తేడాలేదు... కొందరు కామాంధుల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలా ఓ మైనర్ బాలుడిపై ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి లైంగికంగా వేధించిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. 

పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని విల్లివాక్కం జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలుడు ఒంటరిగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఇదే సమయంలో అటువైపు బైక్ పై వెళుతున్న బాలచంద్రన్(47) కన్ను ఈ మైనర్ బాలుడిపై పడింది. దీంతో అభం శుభం తెలియని బాలుడికి మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకున్నాడు. నిర్మానుష్యంగా వుండే ఓ బ్రిడ్జి కిందకు బాలున్ని తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

అయితే అతడు ఏం చేస్తున్నాడో అర్థంకాక బాలుడు గట్టిగా ఏడవడంతో స్థానికులు విన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని ఏడుస్తున్న బాలున్ని ఏమయ్యిందని ప్రశ్నించారు. దీంతో బాలచంద్రన్ లైంగిక వేదింపుల విషయం బయటపడింది. 

Read More  వ్యాపారాన్ని లాభాల్లో నడిపించేందుకు పూజ చేస్తానని బ్యూటీషియన్ పై అత్యాచారం..

బాలుడి మాటలువిని కంగుతిన్న స్థానికులు పారిపోడానికి ప్రయత్నించిన బాలచంద్రన్ ను పట్టుకున్నారు. అతడికి దేేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందంచారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలచంద్రన్ తో పాటు బాాలుడిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

బాలుడి నుండి తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారికి సమచారం అందించారు పోలీసులు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిందితుడి వద్ద ఓ పార్టీ జెండా, ఐడీ కార్డు లభించడంతో అతడు ఆ జాతీయ పార్టీ కార్యకర్తగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?