యమునా నదిలో పడవ బోల్తా.. 30 మందికి పైగా గల్లంతు .. నాలుగు మృతదేహాల వెలికితీత..

By Sumanth KanukulaFirst Published Aug 11, 2022, 5:01 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 30 మందికిపైగా గల్లంతయ్యారు. బందాలోని మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తున్న బోటు అదుపు తప్పి బోల్తాపడింది.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 30 మందికిపైగా గల్లంతయ్యారు. బందాలోని మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తున్న బోటు అదుపు తప్పి బోల్తాపడింది. గల్లైంతన వారిలో 20 నుంచి 25 మంది వరకు చిన్నారులు, మహిళలు ఉన్నారని సమాచారం. గల్లైంతన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 40 మందికి పైగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

నది మధ్యలో పడవ బోల్తా పడటంతో ప్రయాణికులు అందరూ నీటిలో పడిపోయారు. అయితే కొందరు ఈత వచ్చినవారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్‌ఎఫ్, స్థానిక ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

click me!