ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం: నీటిలో కొట్టుకుపోయిన 8 దుకాణాలు, ఏటీఎం.. అందులో రూ.24 లక్షలు

By Siva KodatiFirst Published Aug 11, 2022, 4:49 PM IST
Highlights

ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఏటీఎం వరదల్లో కొట్టుకుపోయింది. కుమోలో నది వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పురోలాలో నది ఒడ్డున 8 దుకాణాలు, ఏటీఏం వున్నాయి. 

ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఏటీఎం వరదల్లో కొట్టుకుపోయింది. కుమోలో నది వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పురోలాలో నది ఒడ్డున 8 దుకాణాలు, ఏటీఏం వున్నాయి. వరదల కారణంగా అవన్నీ కొట్టుకుపోయాయి. ఏటీఎంలో రూ.24 లక్షల నగదు కూడా వున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం సాయంత్రమే ఇందులో నగదును డిపాజిట్ చేశారు అధికారులు. బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కుమోలో నదిలో ప్రవాహం పెరిగి వరదలకు దారి తీసింది. వరద ఉద్ధృతి కొనసాగుతూ వుండటంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!