దేశంలో రాగల 4, 5 రోజులపాటు వర్షాలు.. గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..

Published : Apr 12, 2021, 08:01 PM IST
దేశంలో రాగల 4, 5 రోజులపాటు వర్షాలు.. గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..

సారాంశం

గత రెండు మూడు రోజుల కిందటి వరకు తన ప్రతాపాన్ని చూపించిన భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. ఉక్కపోతతో, అధిక వేడితో ఉక్కిరి బిక్కిరైన దేశప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

గత రెండు మూడు రోజుల కిందటి వరకు తన ప్రతాపాన్ని చూపించిన భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. ఉక్కపోతతో, అధిక వేడితో ఉక్కిరి బిక్కిరైన దేశప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

వచ్చే నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళతో పాటు దక్షిణ కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోను 1,2 ప్రదేశాల్లో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ నెల 14వ తేదీన తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇంటీరియర్ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకన్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.

వాతావరణ మార్పులో భాగంగా హైదరాబాద్ లో చిరుజల్లులు కురిశాయి. దీంతో 
నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా పడింది. 

సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్, సనత్ నగర్, ఆల్వాల్, బోయిన్పల్లి, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం కొద్దిపాటి వర్షం పడింది. దీంతో నగరంలో వాతావరణం మారింది. చిరుజల్లులతో హుస్సేన్ సాగర్ తీరం ఆహ్లాదకరంగా మారిపోయింది. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..