బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు దుర్మరణం..

Published : Aug 27, 2023, 12:05 PM ISTUpdated : Aug 27, 2023, 12:11 PM IST
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..  ఏడుగురు దుర్మరణం..

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు.

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వివరాలు.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్‌ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్రమ బాణసంచా తయారీ కేంద్రానికి ఆనుకుని ఉన్న పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని ఫ్యాక్టరీలో పలువురు వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు ఆదివారం ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !