స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి: మన్‌కీ బాత్ లో మోడీ

By narsimha lodeFirst Published Aug 30, 2020, 2:01 PM IST
Highlights

ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అందరూ స్వదేశీ యాప్ లను వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు.

న్యూఢిల్లీ: ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అందరూ స్వదేశీ యాప్ లను వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు.

ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించారు. కరోనా సమయంలో కూడ రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని ఆయన వారిని అభినందించారు. కరోనా కాలంలో పండుగలను జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు పండుగలు జరుపుకొనే విషయంలో పర్యావరణానికి కలిగించే చర్యలు తీసుకోవద్దని ఆయన సూచించారు.

ఇతర దేశాల నుండి చిన్పపిల్లల ఆట వస్తువులను  దిగుమతి చేసుకోవడం కంటే... మనమే పిల్లల ఆట వస్తువులను తయారు చేయాలని ఆయన కోరారు. ప్రపంచ పోటీని తట్టుకొని నిలబడేలా ఆట వస్తువులను తయారు చేయాలని ఆయన కోరారు.

ఆట వస్తువుల తయారీలో స్థానికంగా ఉండే కళలు, కళాకారులను ప్రోత్సహించాలని మోడీ సూచించారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ లను కచ్చితంగా ధరించాలని ఆయన మరోసారి ప్రజలను కోరారు.

సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో టీచర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు కరోనాతో వచ్చిన సాంకేతిక మార్పులకు కూడ టీచర్లు ధైర్యంగా ఉన్నారన్నారు.

కంప్యూటర్ గేమ్స్ ప్రపంచంలో ప్రసిద్ది చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే వీటిలో ఎక్కువగా ఇతర దేశాలకు చెందినవే ఉన్నాయి. కానీ ఇండియాకు చెందిన ఆటలను కంప్యూటర్ గేమ్స్ గా రూపొందించాలని ఆయన సూచించారు.
 

click me!