
రాంచీ: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బొగ్గు గని కూలిపోయింది. కూలిన బొగ్గు గని శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఆ బొగ్గు గని కూలినప్పుడు 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఓ బొగ్గు గని సొరంగాన్ని వదిలిపెట్టారు. కొన్నేళ్ల క్రితం వదిలేసిన ఈ బొగ్గు బావినే కొందరు అక్రమంగా తవ్వడం ప్రారంభించారు. అక్రమంగా ఈ బొగ్గు గనిని తవ్వుతుండగా అది కూలిపోయింది. ఈ బొగ్గు గని కూలిపోయినప్పుడు కనీసం 12 మంది పని చేస్తున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరంతా ఆ శిథిలాల కిందే చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. కాగా, ఆ శిథిలాల కింద సుమారు 50 మంది వరకూ చిక్కుకున్నారని మరికొన్ని కథనాలు పేర్కొన్నాయి. మరింత సమాచారం ఇంకా బయటకు రావాల్సి ఉన్నది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ధన్‌బాద్ జిల్లాలో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. అప్పడు సుమారు రెండు డజన్ల మంది కార్మికులు దుర్మరణం చెందారు. సీల్ చేసిన బొగ్గు గనిని అక్రమంగా తవ్వుతుండగా ఆ ప్రమాదం జరిగింది. ఓ మైనింగ్ పరికరం సుమారు 20 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడగానే.. బొగ్గు గనిలోని పైకప్పు కుప్పకూలిపోయింది.
ఇదిలా ఉండగా, పెద్దపల్లి జిల్లా ramagundam-3 పరిధిలోని Singareni భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లాంగ్ వాల్ ప్రాజెక్టు (ఏఎల్ సీ)బొగ్గుగనిలో మార్చి 7వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం పైకప్పు కూలడంతో ఇద్దరు అధికారుల సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. ఇందులో ఇద్దరు అదే రోజు రాత్రి సురక్షితంగా బయటపడగా... సేఫ్టీ మేనేజర్ జయరాజ్, గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవీందర్, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్ చిక్కుకున్నారు.
వీరిలో రవీందర్ ను మంగళవారం సాయంత్రం సిబ్బంది కాపాడారు. గనిలో చిక్కుకున్న మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగించగా బుధవారం ఉదయం చైతన్యతేజ, జయరాజ్, శ్రీకాంత్ మృతిచెందినట్లు గుర్తించారు. ఆ తర్వాత వారి మృతదేహాలను వెలికి తీసి సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
కాగా, సోమవారం మధ్యాహ్నం Ramagundam సింగరేణిలో పై కప్పు కూలింది.ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. singareni ఆండ్రియాల రాంగ్ వాల్ ప్రాజెక్టులో coal mine పైకప్పు సోమవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు శిధిలాల కింద చిక్కుకున్నారు. అయితే నలుగురు మృతి చెందారని మొదట అనుకున్నారు. కాకపోతే అందులో ఒకరు మంగళవారం సురక్షితంగా బయటపడగా.. మిగిలిన ముగ్గురు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ అహర్నిశలు ప్రయత్నించింది.