నోయిడాలో ప్రహరీగోడ కూలి నలుగురు మృతి.. డ్రైనేజీ రిపేర్ పనులు చేస్తుండగా ఘటన..

By Sumanth KanukulaFirst Published Sep 20, 2022, 12:10 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌‌లోని నోయిడాలో విషాదం చోటుచేసకుంది. నోయిడాలోని సెక్టార్ 21లోని ఓ హౌసింగ్ సొసైటీ ప్రహరీగోడ కూలిన ఘటలో నలుగురు మరణించారు.

ఉత్తరప్రదేశ్‌‌లోని నోయిడాలో విషాదం చోటుచేసకుంది. నోయిడాలోని సెక్టార్ 21లోని ఓ హౌసింగ్ సొసైటీ ప్రహరీగోడ కూలిన ఘటలో నలుగురు మరణించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కొంతమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. కొందరు కార్మికులు జల్ వాయు విహార్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న డ్రెయిన్ రిపేర్ పనులు చేపడుతున్నారని అధికారులు తెలిపారు. అయితే ఆ సమయంలో గోడ కూలిపోయిందని చెప్పారు.

ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ‘‘రెస్క్యూ, రిలీఫ్ చర్యలు ప్రారంభించబడ్డాయి. సీనియర్ అధికారులతో సహా అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు’’ అని పోలీసులు తెలిపారు. ఇక, మృతులు యూపీలోని బదౌన్ జిల్లాకు చెందినవారిగా తెలుస్తోంది. 

‘‘సెక్షన్ 21లో జల్ వాయు విహార్ సమీపంలో డ్రైనేజీ మరమ్మత్తు పనుల కోసం  నోయిడా అథారిటీ కాంట్రాక్ట్ ఇచ్చింది. కార్మికులు ఇటుకలను బయటకు తీస్తున్నప్పుడు గోడ కూలిపోయిందని మాకు చెప్పబడింది. ఇది విచారణ చేయబడుతుంది. నలుగురు మరణించినట్టుగా తమకు సమాచారం వచ్చింది’’ నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. 

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన యోగి ఆదిత్యనాథ్.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

click me!