కేదార్‌నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

Published : Oct 18, 2022, 12:44 PM IST
కేదార్‌నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

సారాంశం

ఉత్తరాఖండ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌కు సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.

ఉత్తరాఖండ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌కు సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. కేదార్‌నాథ్‌కు రెండు కిలోమీటర్ల ముందు గరుడ్ చట్టిలో ప్రమాదం జరిగింది. ఫాటా నుండి కేదార్‌నాథ్‌కు యాత్రికులను తీసుకువెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా  తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఫాటాలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అభినవ్ కుమార్ తెలిపారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు.. ఘటన స్థలానికి బయలుదేరాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?