ఉత్తరాఖండ్‌లో 600 మీటర్ల లోతైన లోయలో పడిపోయిన కారు.. 9 మంది దుర్మరణం..

Published : Jun 22, 2023, 02:42 PM ISTUpdated : Jun 22, 2023, 02:45 PM IST
ఉత్తరాఖండ్‌లో 600 మీటర్ల లోతైన లోయలో పడిపోయిన కారు.. 9 మంది దుర్మరణం..

సారాంశం

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి 600 మీటర్ల లోయలో పడటంతో తొమ్మిది మంది మృతిచెందారు.

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి 600 మీటర్ల లోయలో పడటంతో తొమ్మిది మంది మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మున్సియారీ ప్రాంతంలోని హోకారా గ్రామంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో పదకొండు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్) బృందం కూడా  ప్రమాద స్థలానికి బయలుదేరింది. 

బగేశ్వర్ జిల్లాలోని సామా గ్రామం నుండి యాత్రికులు హోక్రాలోని కోకిలా దేవి ఆలయానికి వెళుతుండగా ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని దీదీహత్ ఎస్‌డీఎం అనిల్ కుమార్ శుక్లా తెలిపారు. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్డు బురదమయమైందని.. ఈ కారణంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?