పరీక్షలో కాపీయింగ్, టీచర్ కొట్టాడని.. ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

By SumaBala BukkaFirst Published Sep 24, 2022, 1:56 PM IST
Highlights

కాపీ కొడుతున్నాడని టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి మనస్థాపానికి గురై ఓ ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఉత్తర ప్రదేశ్ : ఉపాధ్యాయుడు తనపై చేయి చేసుకున్నాడని మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో గురువారం చోటు చేసుకుంది. జవహర్ విహార్ కాలనీకి చెందిన యష్ రతపూర్ లోని సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం బయాలజీ పరీక్షకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను కాపీయింగ్ చేస్తున్నట్లు టీచర్ గుర్తించాడు. వెంటనే అతనిపై చేయి చేసుకున్న ఆయన తోటి విద్యార్థుల ముందు అవమానించారు. 

ఆ తర్వాత యష్ ను ప్రిన్సిపల్ ఆఫీసుకి తీసుకువెళ్లారు.  దీంతో ఆ విద్యార్థి  మనస్థాపానికి గురయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చివరికి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. పోలీసులు యష్ రాసిన సూసైడ్ లెటర్ ను  స్వాధీనం చేసుకున్నారు. ‘బయాలజీ పరీక్షలో నేను చీటింగ్ చేశాను. నేను చనిపోతున్నాను. ఎవరైనా తప్పుచేస్తే వారికి మరో ఛాన్స్ ఇవ్వాలి. నేను చేసిన తప్పుకు.. నేను ఎంతో బాధ పడుతున్నాను. నా తోటి విద్యార్థులు నన్ను సిగ్గు సిగ్గు అంటూ హేళన చేశారు. నా తల్లిదండ్రులకు, స్నేహితులకు  క్షమాపణలు చెబుతున్నా’ అని యష్ ఆ లేఖలో పేర్కొన్నాడు. 

ఇండోర్ లో దారుణం.. ఏడేళ్ల చిన్నారి జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి, కత్తితో పొడిచి హత్య..

ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణమై ఘటన వెలుగు చూసింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే.. వారి పాలిట కాలయములుగా మారుతున్నారు. పలురకాలుగా వారిని బెదిరిస్తూ, వేధిస్తూ అనాగరికంగా, అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దమ్మపేట మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన బాలిక ఆ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. 

ఆ బాలిక పై కన్నేసిన ఉపాధ్యాయుడు పిచ్చయ్య ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. దీనికోసం పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తన మాట వినకపోతే చంపుతానని బాలికను బెదిరించాడు. అలా పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ వారు ఆమెకు వైద్యపరీక్షలు చేయించారు.   

బాలికను పరీక్షించిన వైద్యులు  ఆమె గర్భం దాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. విద్యార్థినిని నిలదీయడంతో బాలికల పాఠశాలలో జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో విద్యార్థిని తల్లి దమ్మపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  ఉపాధ్యాయుడు పిచ్చయ్యపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు.

click me!