ఏడు మార్గాల్లో ఇండియాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న భారత ముస్లింలు

Published : Feb 28, 2023, 01:20 PM IST
ఏడు మార్గాల్లో ఇండియాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న భారత ముస్లింలు

సారాంశం

భారత ముస్లింలు దేశాభివృద్ధికి కీలకంగా ఉపయోగపడతారని డాక్టర్ షొమైలా వార్సి తెలిపారు. భారత ముస్లిం సమాజం కొన్ని సంస్కరణలు వేగంగా చేపట్టి ముస్లిం మహిళలు తమ హక్కులు తెలుసుకుని, వారి శక్తియుక్తులను పూర్తిగా ఉపయోగించుకుని అభివృద్ధికి ఉపయోగపడేలా వ్యవహరించాలని పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: భారత్‌ను బలోపేతం చేయడంలో ఇండియా ముస్లింలు కీలక పాత్ర పోషించవచ్చు. దేశ అభివృద్ధి, ముందడుగులో గణనీయమైన మార్పు తేవచ్చు. దేశ జనాభాలో 15 శాతం ఉన్న ఈ కమ్యూనిటీ దేశాన్ని సుసంపన్న చేయడానికి, శాంతియుతంగా ఉంచడానికి ఏడు మార్గాల్లో పౌరులుగా కృషి చేయవచ్చు.

1. విద్య: సాధికారతకు, పురోగతికి విద్య కీలకమైంది. భారత ముస్లింలు నాణ్యమైన విద్యను ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమ్యాటిక్స్‌లపై దృష్టి సారించాలి. ఇది దేశాభివృద్ధిలో వైయక్తికంగా వారు పాల్గొనడానికి ఉపకరిస్తుంది. ముస్లింల అక్షరాస్యత 68.5 శాతానికి తక్కువగా ఉంది. ఇది దేశ సగటుకు చాలా తక్కువ. మద్రాసాల్లో విద్యతోపాటు రెగ్యులర్ ఎడ్యుకేషన్ వారికి అందించాలి. ఇటీవలి సంవత్సరాల్లో కమ్యూనిటీలోపలే మంచి విద్య కోసం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి.

2. ఎంట్రప్రెన్యూర్షిప్: భారత ముస్లింలు నూతన ఆవిష్కరణ అవకాశాలు, అంకురాల ఏర్పాటు పై దృష్టి పెట్టి వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ కమ్యూనిటీ భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్‌జీ (చైర్మన్, విప్రో), ఎంఏ యూసుఫ్ అలీ, లులు గ్రూప్ చైర్మన్, యూసుఫ్ ఖ్వాజా హమీద్ (సిప్లా, చైర్మన్)లను అందించింది. కమ్యూనిటీలోని నిరుద్యోగాన్ని పారదోలడానికి ఇది సరైన మార్గం.

3. కమ్యూనిటీ డెవలప్‌మెంట్: భారత ముస్లింలు వారి కమ్యూనిటీ అభివృద్ధికి క్రియాశీలకంగా పాల్గొనాలి. వారు సాంఘిక సంక్షేమ ప్రాజెక్టులు, ఆరోగ్య కార్యక్రమాలు, విద్యకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టి వారి కమ్యూనిటీ వృద్ధికి దోహదపడవచ్చు. ప్రభుత్వానికి, ఎన్జీవోలకు మధ్య దూరాన్ని తగ్గించడంలో విశ్వాస ఆధారిత సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.

4. రాజకీయంగా చురుకుదనం: ఓటింగ్, ఎన్నికల్లో పోటీలో ఇండియన్ ముస్లింలు చురుకుగా పాల్గొనాలి. ఇది నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారి గళం వినిపించడానికి దోహదపడుతుంది. తద్వార అన్ని కమ్యూనిటీలు లబ్ది పొందేలా విధానాలను రూపొందించవచ్చు. అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజాస్వామ్య ఫలాలు పొందాలి. దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్లుగానూ ఈ కమ్యూనిటీ వారు చేశారు. అన్ని కమ్యూనిటీలకు సమాన అవకాశాలు ఇచ్చే భూమి ఈ భారత దేశం.

5.మతాంతర సామరస్యం: భారత ముస్లింలు మతాంతర సామరస్యం కోసం పాటుపడాలి. ఇతర కమ్యూనిటీలతో సామరస్యత కోసం కృషి చేయాలి. సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు వంటివి నిర్వహించడం ద్వారా ఒకరిపట్ల ఒకరికి గౌరవం, సహానుభూతి ఏర్పడుతాయి. ఇతర మత విశ్వాసాలపట్ల ఈ కమ్యూనిటీ లోపల, అలాగే ఇతర మతాల్లో ఇస్లాం గురించి తప్పుడు అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమాలు, చర్చల ద్వారా వీటికి చెక్ పెట్టవచ్చు.

6. దేశభక్తి: దేశం పట్ల గర్వపడాలి. ఆ దేశాభివృద్ధి, ముందడుగులో భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల్లో పాల్గొని వృద్ధికి తోడ్పడాలి. ఇస్లాం ఇతర దేశాల్లోనూ ఉండే మతం కాబట్టి, ఇందులో దేశ భక్తికి స్కోప్ ఉండదనే భావన ఉన్నది. కానీ, జావెద్ అమ్మద్ ఘామిడి జాతీయవాదాన్ని పాజిటివ్ శక్తిగా తీసుకోవాలని రాశారు. ఆయన రాసిన మిఝాన్ పుస్తకంలో ఖురాన్, సున్నా‌లు జాతీయవాదాన్ని నిషేధించవని రాశారు. కానీ, వేరే వారిపై అణచివేత, వారిపై కోపాన్ని జస్టిఫై చేసుకోవడానికి నేషనలిజాన్ని వాడుకోవద్దని సూచిస్తున్నాయని వివరించారు.

7.ముస్లిం మహిళలు, అణగారిన ముస్లింలు: భారత ముస్లిం సమాజం అనేక సంస్కరణలు చేపట్టి ముస్లిం మహిళలు వారి హక్కులను తెలుసుకునేలా... తద్వార వారి శక్తియుక్తులను అభివృద్ధికి ఉపయోగించేలా సహకరించాలి. ఈ దిశలో కొత్త ఆలోచనలను అంగీకరించడానికి చాలా మంది జంకుతున్నారు. ఇస్లాంలోనే ఇతర బోధనలను అనుసరించేవారిని, ముస్లిం మహిళలను, ట్రాన్స్ పీపుల్స్‌ను, పాస్మందా ముస్లింలు, షియా, అహ్మదీలను అంగీకరించి వారిపట్ల ఉదారతతో మెలగాలి. సహనం, మార్పు స్వీకరణ వంటి ఆలోచనలను పెంచడం ద్వారా భారత ముస్లింలు దేశానికి ఎంతో గొప్ప సేవను అందించినవారవుతారు.

 

డాక్టర్ షోమైలా వార్సి ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మహారాజ అగ్రసేన్ కాలేజీలో రాజనీతి, అంతర్జాతీయ సంబంధాల శాఖలో బోధిస్తున్నారు.

ఈ వ్యాసం తొలిగా  AwazTheVoice లో ప్రచురితమైంది. దీన్ని అనుమతితో ఇక్కడ పున:ప్రచురించాం.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్