బ్రెడ్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి.. బాడీబిల్డర్ మృతి..

By SumaBala BukkaFirst Published Feb 28, 2023, 12:44 PM IST
Highlights

గొంతులో ఇరుక్కున్న ఓ బ్రెడ్డు ముక్క బాడీ బిల్డర్ ప్రాణాలు తీసింది. ఈ విషాద గటన తమిళనాడులో జరిగింది. 

కడలూరు : బ్రెడ్డు ముక్క గొంతులో ఇరుక్కుని ఓ బాడీ బిల్డర్ మృతి చెందిన విషాద ఘటన కడలూరులో చోటుచేసుకుంది. వర్కౌట్ చేస్తే.. మధ్యలో ఆహారం కోసం ఇచ్చిన బ్రేక్ లో ఈ ఘటన జరిగింది. ఆ 21యేళ్ల బాడీ బిల్డర్ పేరు ఎం హరిహరన్. స్వస్థలం సేలం జిల్లాలోని పెరియ కొల్లపట్టి. తమిళనాడు, కడలూరు జిల్లాలోని వడలూరులో రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌కు శిక్షణ పొందుతున్నాడు. అతను అండర్-70 కేజీల విభాగంలో పోటీ పడుతున్నాడు.

చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోటీదారులు కడలూరు చేరుకున్నారు. వీరంతా వడలూరులోని ఒక కళ్యాణ మండపంలో బస చేశారు. హరిహరన్ ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అప్పటివరకు వర్క్ ఔట్ చేశాడు. ఆ తరువాత బ్రేక్ తీసుకుని.. కాసేపటి తరువాత బ్రెడ్ తిన్నాడు. ఆ బ్రెడ్డుముక్క పెద్దగా ఉండడంతో అది గొంతులో ఇరుక్కుంది. అతను శ్వాస తీసుకోలేకపోయాడు. దీంతో ఊపిరి ఆడక వెంటనే మూర్ఛపోయాడు. అది గమనించిన తోటివారు... వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

Latest Videos

వరంగల్ లో విషాదం.. కొబ్బరిముక్క గొంతులో అడ్డుపడి పదినెలల చిన్నారి మృతి...

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా వెలుగు చూశాయి. నిరుడు నవంబర్ లో మద్యం తాగుతున్న వ్యక్తి గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుపోవడంతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని పర్మిట్ రూంలో కూర్చుని మద్యం తాగుతున్నాడు. మద్యంలోకి మంచింగ్ గా ఆమ్లెట్ ఆర్డర్ చేశాడు. 

ఆమ్లెట్ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయాడు. ఇది గమనించిన దుకాణదారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

ఇదిలా ఉండగా, అంతకు ముందు యేడు జూన్ లో అస్సాంలో ఇలాంటి ఘటనే చోటు చేసకుంది. లిచీ పండు గింజ గొంతులో ఇరుక్కుని 16యేళ్ల బాలిక మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోర్హాట్ జిల్లా, కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10వ తరగతి చదువుతోంది.

విషాదం.. హోమియో మందుల డబ్బా గొంతులో ఇరుక్కుని.. పదినెలల బాలుడు మృతి... 

కానిస్టేబుల్ గా పనిచేసే బాలిక తండ్రి ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు లిచీ పళ్లను తీసుకొచ్చారు. వాటిని తిన్న బాలిక కొంత సేపటికే నేల కూలింది. ఏమైందో అర్థం కాని తల్లిదండ్రులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. 

సుమారు రెండు అంగుళాల పొడవు ఉండే లిచీ పండు విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆ అమ్మాయి మరణించిందని వారు స్పష్టం తెలిపారు. కూతురి మీద ప్రేమతో తెచ్చిన పండ్లు ఆమె ప్రాణాలు తీయడం, ఆకస్మిక మరణం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

click me!