జమ్మూ కాశ్మీర్ లో లోయలో పడిపోయిన బస్సు.. ఐదుగురు మృతి, 15 మందికి గాయాలు

By team teluguFirst Published Jan 21, 2023, 4:09 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లో ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయారు. 15 మందికి గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. కథువా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

ఓ మినీ బస్సు మోండ్లీ నుండి ధను పరోల్ గ్రామానికి శుక్రవారం వెళ్తోంది.  బిల్లావర్ ప్రాంతంలోని సిలా గ్రామం వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం లోయలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయి.

ఏడేళ్ల బాలిక ప్రాణాలు తీసిన‌ సవతి తల్లి.. కార‌ణం విని షాకైన పోలీసులు

ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రమాద బాధితుల్లో ఒకరు హాస్పిటల్ కు తరలిస్తుండగానే పరిస్థితి విషమించి మరణించారు. మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో గతేడాది నవంబర్ 28వ తేదీన కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఓ ముస్లిం మత నాయకుడు, ఆయన కుటుంబంలోని ముగ్గురు సభ్యుల ఉన్నారు. జామియా మసీదుసు చెందిన ఇమామ్ ముఫ్తీ అబ్దుల్ హమీద్ (32), తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి గూల్ సంగల్దాన్ నుండి ఉధంపూర్ వైపు వెళ్తోంది. ఉదయం 8.30 గంటల సమయంలో ఉధంపూర్ జిల్లా చెనాని ప్రాంతంలోని ప్రేమ్ మందిర్ సమీపానికి చేరుకునే సరికి కారు అదుపుతప్పి 700 అడుగుల లోయలో పడిపోయింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై మరోసారి దాడి.. బిహార్‌లో రాళ్లు విసిరేసిన దుండగులు

ఈ ప్రమాదంలో ముఫ్తీ అబ్దుల్ హమీద్ తో పాటు ఆయన తండ్రి ముఫ్తీ జమాల్ దిన్ (65) అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆయన తల్లి హజ్రా బేగం (60), మేనల్లుడు ఆదిల్ గుల్జార్ (16) తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిని ఉదంపూర్ జిల్లాలోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో వారు కూడా మరణించారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

2047 కల్లా భారత దేశంలో ఇస్లాం పాలన రావాలనేదే పీఎఫ్ఐ లక్ష్యం.. కిల్లర్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసుకుంది: ఎన్‌ఐఏ

అక్టోబర్ 5వ తేదీన ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో కూడా ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 32 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇదే రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీన చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

click me!