కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరపై రాళ్ల దాడి.. తలకు గాయం..

Published : Apr 28, 2023, 06:54 PM ISTUpdated : Apr 28, 2023, 07:25 PM IST
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరపై  రాళ్ల దాడి.. తలకు గాయం..

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జి పరమేశ్వరపై దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జి పరమేశ్వరపై దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దుండగులు రాళ్లు విసరడంతో.. ఆయనకు తలకు గాయమైంది. పరమేశ్వర శుక్రవారం తుమకూరు జిల్లాలోని కొరటగెరె నియోజకవర్గం బైరనహళ్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపులో నుంచి రాళ్లు విసిరినట్టుగా చెబుతున్నారు. దీంతో పరమేశ్వర తలకు గాయాలు అయ్యాయి. రక్తస్రావం అరికట్టేందుకు గాయంపై గుడ్డ ఉంచి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?