‘చిలుకతో చచ్చే చావొచ్చింది.. అరెస్ట్ చేయండి సార్’.. పోలీస్ స్టేషన్ లో వృద్ధుడి ఫిర్యాదు..

By Bukka SumabalaFirst Published Aug 8, 2022, 8:17 AM IST
Highlights

పూనేలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ చిలుక తనను ఇబ్బంది పెడుతోందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింట్లో పెంచుకుంటున్న ఆ చిలుక అరుపులు, గొడవలు తనకు నిద్రలేకుండా చేస్తున్నాయని వాపోయాడు. 

పూణే : పొరుగింట్లో పెంచుకుంటున్న ఓ చిలక వల్ల తనకు తెగ ఇబ్బంది కలుగుతోందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అరుపులు, కీచులాటతో తనకు నిద్రలేకుండా చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర పూణేలో శివాజీ నగర్ ప్రాంతంలో నివసించే అక్బర్ అజ్మెర్ ఖాన్ ఇంట్లో ఓ చిలకను పెంచుకుంటున్నాడు. అయితే, దాని కీచులాట పొరుగింట్లో ఉండే సురేష్ శిందే (72)ను తెగ ఇబ్బంది పెట్టిందట. దాని చిలక గోలకు సరిగా నిద్ర పట్టడం లేదని, ప్రశాంతత లేకుండా పోతోందని అతడు తాజాగా ఖడ్కీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై ఖడ్కీ పోలీస్ స్టేషన్ అధికారులు స్పందించారు. చిలుక ద్వారా ప్రశాంతతకు భంగం కలుగుతుందని ఓ ఫిర్యాదు అందింది. నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, జూలై 20న ఇలాంటి చిలుకకు సంబంధించిన కేసే.. కర్ణాటక పోలీసులకు వచ్చింది. తమకు ఎంతో ఇష్టమైన… ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు చిలకల్లో ఒకటి కనిపించకుండా పోవడంతో ఓ కుటుంబం విలవిల్లాడిపోతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ఎంతో ప్రేమగా పెంచుకున్న చిలక కోసం రేయింబవళ్ళూ వెతుకుతోంది. ఆచూకీ చెప్పినవారికి రూ. 50,000 నజరానా ఇస్తామంటూ పోస్టర్లు వేశారు. ఈ  ఆసక్తికర ఘటన కర్ణాటకలోని తుముకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తుమకూరులోని జయనగర్ లో నివాసం ఉంటున్న కుటుంబం గత రెండున్నరేళ్లుగా రెండు ఆఫ్రికన్ చిలుకలు పెంచుకుంటుంది.

Amarnath Yatra: యాత్రికుల సంఖ్య తగ్గడంతో జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

వాటిని ఇంటి సభ్యులుగానే భావించేవారు. ఏటా వాటి పుట్టిన రోజులను ఘనంగా నిర్వహించేవారట. కానీ ఈసారి రుస్తుం అనే చిలుక జూలై 16 నుంచి కనబడకపోవడంతో దానికోసం వెతుకుతూ నగరమంతటా పోస్టర్లు అతికించారు. ‘ఆ చిలుకను మేము ఎంతో మిస్ అవుతున్నాం.  అది  మా కుటుంబంలాగే.  మీ బాల్కనీల్లో,  కిటికీల వద్ద కనబడితే  గుర్తించి మాకు చెప్పి సహాయం చేయండి.  ఆ చిలుకతో మాకెంతో అటాచ్మెంట్ ఉంది. ఎక్కడైనా చూస్తే చెప్పండి.  ఆచూకీ చెప్పినవారికి మేం. రూ. 50,000 అందజేస్తాం’  అని ఆ చిలుకను పెంచుకున్న కుటుంబ సభ్యులు  పల్లవి, అర్జున్ తెలిపారు. 

కాగా, మే 15న ఛత్తీస్ ఘడ్ లోనూ చిలుకను వెతికిపెట్టమంటూ ఓ ఫిర్యాదు అందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిలుక ఎక్కడితో ఎగిరిపోయింద‌ని, దానిని వెతికిప‌ట్టుకోవాల‌ని ఓ వ్య‌క్తి పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. ఈ వింత ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వినడానికి వింతగా ఉన్నా ఫిర్యాదు అందాక పోలీసులకు తప్పదు కాబట్టి వారు చిలుకను పట్టుకోవడానికి ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టాడు. 

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బస్త‌ర్ జిల్లా గ‌జ‌ద‌ల్ పుర్ రాష్ట్రానికి చెందిన మ‌నీష్ ఠ‌క్క‌ర్ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా ఓ చిలుక‌ను తమింట్లో పెంచుకుంటున్నాడు. దాన్ని సొంత కుటుంబ స‌భ్యురాలిలా చూసుకుంటున్నాడు. అయితే ఎప్పుటిలాగే ఓ రోజు పంజ‌రాన్ని తెరిచాడు. ఎప్పుడూ బాగానే ఉండే చిలుక ఆ రోజు ఏమనుకుందో ఏమో గానీ పంజరం తెరవగానే ఎగిరిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు. 

click me!