మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్ నియామకం: రాష్ట్రపతి ఉత్తర్వులు

Published : Aug 22, 2021, 12:21 PM IST
మణిపూర్ గవర్నర్‌గా  లా గణేశన్ నియామకం: రాష్ట్రపతి ఉత్తర్వులు

సారాంశం

తమిళనాడు రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లా గణేశన్ ను మణిపూర్ గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు.ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్రపతి కార్యాలయం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

న్యూఢిల్లీ:  తమిళనాడు రాష్ట్రానికి చెందిన  బీజేపీ సీనియర్  నేత లా గణేశన్ మణిపూర్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.మణిపూర్ గవర్నర్ గా పనిచేసిన నజ్మా హెప్థుల్లా  రిటైర్ అయిన తర్వాత  ఈ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో మణిపూర్ గవర్నర్ గా లా గణేశన్ ను నియమించారు.

ఈ మేరకు రాష్ట్రపతి భవన్  ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేసింది.  ఈ నెల 10వ తేదీన నజ్మాహెప్థులల్లా రాజ్ భవన్ ను విడిచివెళ్లారు. అదే రోజున సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ కు మణిపూర్ గవర్నర్ బాధ్యతలను అప్పగించారు.
 

PREV
click me!

Recommended Stories

ప్ర‌తిప‌క్షాల‌కు మోదీ, షా మాస్ట‌ర్ స్ట్రోక్‌.? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగినా బీజేపీకే లాభ‌మా.?
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu