కొత్త అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి

By Siva KodatiFirst Published Sep 28, 2022, 9:59 PM IST
Highlights

భారతదేశానికి నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్. వెంకట రమణి నియమితులయ్యారు. మూడేళ్లపాటు వెంకట రమణి భారత అటార్నీ జనరల్‌గా పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ను ప్రచురించింది.

భారతదేశానికి నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్. వెంకట రమణి నియమితులయ్యారు. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. దీంతో ఆయన నుంచి వెంకట రమణి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడేళ్లపాటు వెంకట రమణి భారత అటార్నీ జనరల్‌గా పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ను ప్రచురించింది. 

ఏప్రిల్ 13, 1950లో పాండిచ్చేరిలో జన్మించారు వెంకటరమణి. జూలై 1977లో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో ఆయన లాయర్‌గా రిజిస్టర్ అయ్యారు. 1979లో తన లా ప్రాక్టీస్‌ను సుప్రీంకోర్ట్‌కు మార్చారు వెంకట రమణి. 1997లో సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాదిగా ఆయన నియమితులయ్యారు. 2010, 2013లలో వెంకట రమణి భారత లా కమీషన్ సభ్యునిగా పనిచేశారు. గడిచిన 12 ఏళ్లుగా తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. 

కాగా.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఏజీగా బాధ్యతలు చేపడతారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే రోహత్గీ ఈ నియామకం విషయంలో తనను పరిగణనలోనికి తీసుకోవద్దని కేంద్రానికి సూచించడంతో వెంకటరమణికి మార్గం సుగమమైంది. 

click me!