
ముంబయి: మహారాష్ట్ర ఎమ్మెల్యే బచ్చు కడు వీధి కుక్కల బెడద తీరడానికి ఇచ్చిన సూచన వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని వీధి కుక్కలను అసోం రాష్ట్రానికి పంపాలని అన్నారు. అక్కడ కుక్కలకు మంచి డిమాండ్ ఉన్నదని అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇటీవలే అసోం పర్యటించానని వివరించారు. అక్కడ కుక్కలకు మంచి డిమాండ్ ఉన్నదని తెలిపారు. అక్కడి వారు కుక్కలను ఆహారంగా భుజిస్తారని తనకు తెలిసిందని అన్నారు. అక్కడ ఒక్క కుక్కకు సుమారు రూ. 8 వేల వరకు పలుకుతున్నదని చెప్పారు. కాబట్టి, మహారాష్ట్రలో కుక్కల బెడదను పరిష్కరించడానికి తాను ఒక సలహా ఇస్తానని అన్నారు.
అసోం నుంచి వ్యాపారులను మహారాష్ట్రకు రప్పించాలని, వారితో డీల్ మాట్లాడుకుని ఇక్కడి వీధి కుక్కలను అసోం రాష్ట్రానికి పంపించాలని అన్నారు. అక్కడ ఆ కుక్కలను వదశాలలకు తరలించి మాంసం కోసం వదించి మార్కెట్‌లలో అమ్ముతారని తెలిపారు.
Also Read: ఎక్స్ లవర్‌పై పగ తీర్చుకోవాలని ఆమె పేరిట ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన యువకుడు.. ఏం చేశాడంటే?
ఆయన వ్యాఖ్యలపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు అమానుషంగా ఉన్నాయని తెలిపారు.
కుక్కల గురించి ఇలా అనుమానుషంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరాంచి నారాయణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలోని వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఏ దారి కనిపించట్లేదంటే.. నాగాల్యాండ్ ప్రజలను ఇక్కడికి రప్పిస్తే చాలు సమస్య తీరుతుందని అన్నారు.