శివసేన మద్దతు మాకే: కేంద్ర మంత్రి అనంతకుమార్

First Published Jul 19, 2018, 10:59 AM IST
Highlights

కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా శివసేన  ఓటు చేస్తోందని కేంద్ర  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు.
 

న్యూఢిల్లీ: కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా శివసేన  ఓటు చేస్తోందని కేంద్ర  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు.

కేంద్రంపై  అవిశ్వాసం గెలవడంలో  తమకు సంఖ్యాబలం ఉందని  కాంగ్రెస్ పార్టీ  మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. బీజేపీయేతర పార్టీల సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సోనియాగాంధీ ప్రకటించారు.అయితే సోనియాగాంధీ వ్యాఖ్యలకు  గురువారం నాడు కేంద్రమంత్రి అనంతకుమార్ కౌంటరిచ్చారు. ఎన్డీఏలో శివసేన భాగస్వామ్యంగా ఉందని ఆయన గుర్తు చేశారు. 

అవిశ్వాసం సందర్భంగా  కేంద్రప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. లోక్‌సభలో ఎన్డీఏకు 313 మంది సభ్యుల బలం ఉందన్నారు.  బీజేపీకి స్వంతంగా  274 మంది ఎంపీలున్నారని ఆయన చెప్పారు.

శివసేన అవిశ్వాసంలో  ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే మహారాష్ట్రలో పోటీ చేస్తామని శివసేన ఇప్పటికే ప్రకటించింది.  ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడ శివసేన ఒంటరిగా పోటీ చేసింది. ఉప ఎన్నికల ఫలితాల సందర్భంగా  బీజేపీపై శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆ తర్వాత శివసేన చీఫ్  ఉధ్థవ్ ఠాక్రేను  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు. అయితే  ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంలో మార్పు లేదని  శివసేన ప్రకటించింది.అయితే  తాజాగా కేంద్రంపై అవిశ్వాసం విషయంలో  శివసేన ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది.

click me!