సెమీకాన్ ఇండియా 2024: సెమీకండక్టర్ల తయారీ హబ్ గా ఉత్తరప్రదేశ్ : సీఎం యోగి ఆదిత్యానాథ్

By Arun Kumar P  |  First Published Sep 11, 2024, 9:54 PM IST

ఉత్తరప్రదేశ్‌ను సెమీకండక్టర్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.నోయిడాలో జరిగిన సెమీకాన్ ఇండియా-2024ను పీఎం నరేంద్ర మోదీతో కలిసి ప్రారంభించారు యోగి. 


గ్రేటర్ నోయిడా: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీకాన్ ఇండియా- 2024 నేడు (బుధవారం) ప్రారంభంఅయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో పాటు వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి మాట్లాడుతూ... ప్రధాని మోడీ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి, డిజైన్, సాంకేతిక అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ విషయంలో భారత్ ప్రపంచ నాయకుడిగా నిలబెడుతుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తం చేసారు.

Latest Videos

నేడు ఉత్తరప్రదేశ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా ఉద్భవించిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కృషి ఫలితంగానే దేశంలోని మొబైల్ తయారీలో 55 శాతం, మొబైల్ భాగాల ఉత్పత్తిలో 50 శాతం వాాటా ఉత్తరప్రదేశ్‌ కు దక్కిందన్నారు. శామ్సంగ్ ఇండియా తన డిస్‌ప్లే యూనిట్ ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోందని సీఎం యోగి వెల్లడించారు. 

ఉత్తరప్రదేశ్ డేటా సెంటర్‌కు కూడా కేంద్రంగా మారుతోందని యూపీ సీఎం తెలిపారు. సెమీకండక్టర్‌కు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ సెమీకండక్టర్ విధానం-2024ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానంలో మూలధన సబ్సిడీ, వడ్డీ రాయితీ, భూమి ధర, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలపై రాయితీ వంటి అనేక ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయన్నారు. 

2020లో వ్యాపించిన కరోనా మహమ్మారితో పాటు వివిధ కారణాల వల్ల జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం పడిందన్నారు. దీనివల్ల సెమీకండక్టర్ పరిశ్రమ కూడా ప్రభావితమైందన్నారు. ప్రపంచం కరోనాతో తల్లడిల్లుతున్న సమయంలో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం కరోనాను సమర్దవంతంగా ఎదుర్కోవడమే కాదు  సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి చేసుకుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడం వైపు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని యోగి అన్నారు.

ప్రధానమంత్రి మోడీ మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ ఐటీ రంగం, డేటా సెంటర్, ఎలక్ట్రానిక్ తయారీ, సెమీకండక్టర్‌లపై ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం యోగి అన్నారు. నేడు ఉత్తరప్రదేశ్ ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్ల కేంద్రంగా అవతరిస్తోందని ఆయన అన్నారు. మీడియాటెక్, ఈఆర్ఎం, క్వాల్కామ్, ఎన్హెచ్పీ, సినాప్సిస్ క్యాడెన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి, ఇవి ఉత్తరప్రదేశ్‌లో స్థానిక ప్రతిభను ఉపయోగించుకోవడానికి, సెమీకండక్టర్ డిజైన్‌లో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్‌లో ఐటీకి పరిశ్రమ హోదా ఇవ్వబడింది, తద్వారా అధికారుల పరిధిలోకి వచ్చే పారిశ్రామిక భూమిని ఐటీ కంపెనీలకు తక్కువ ధరలకు అందించవచ్చని సీఎం యోగి తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించే దిశగా అనేక చర్యలు తీసుకున్నామని సీఎం యోగి అన్నారు. దీని ఫలితంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఉత్తరప్రదేశ్ అచీవర్ స్టేట్ హోదాను సాధించిందన్నారు. యూపీ ఎఫ్‌డిఐ ఫార్చ్యూన్ గ్లోబల్-500, ఫార్చ్యూన్ ఇండియా-500 కంపెనీల కోసం ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తోందని అన్నారు.

పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకుంటూ సింగిల్ విండో పోర్టల్ 'నీవేష్ మిత్ర' ద్వారా 450కి పైగా ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నామన్నారు.. ఎంఓయుల పర్యవేక్షణ కోసం 'నీవేష్ సారథి' పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. ప్రోత్సాహకాల పంపిణీని కూడా నేడు రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. పెట్టుబడిదారులకు సహాయం చేయడానికి 100 మంది వ్యవస్థాపక మిత్రులను నియమించామన్నారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మౌలిక సదుపాయాల అనుసంధానం, బలమైన చట్టాలు నేటి ఉత్తరప్రదేశ్ యొక్క ప్రత్యేకతలు అని సీఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైలు,    రోడ్డు మార్గాలున్నాయి. వారణాసి నుండి హల్దియా వరకు దేశంలోనే మొట్టమొదటి జలమార్గం కూడా అందుబాటులో ఉంది. వారణాసిలో మల్టీ-మోడల్ టెర్మినల్‌తో పాటు దాద్రిలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్, ఊనావోలో లాజిస్టిక్స్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి రాష్ట్రంలోనే మొట్టమొదటి వైద్య ఉపకరణాల పార్కు, ఫిల్మ్ సిటీ, టాయ్ సిటీ, హస్తకళల పార్కును అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, బరేలీలో మెగా ఫుడ్ పార్క్, ఉన్నావోలో ట్రాన్స్ గంగా నగరం వంటి ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

 

click me!