'డైనమిక్ సిటీ'గా నోయిడా: యోగి సర్కార్ సరికొత్త వ్యూహం

By Arun Kumar P  |  First Published Sep 11, 2024, 11:04 AM IST

నోయిడాను శక్తివంతమైన, ఆధునిక నగరంగా అభివృద్ధి చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో పర్యాటక ఆకర్షణల అభివృద్ధి, సెల్ఫీ పాయింట్ల నిర్మాణం, బ్రాండింగ్‌పై దృష్టి సారించింది.


లక్నో. ఉత్తర ప్రదేశ్‌ను 'ఉత్తమ ప్రదేశ్'గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది యోగి ప్రభుత్వం. ఇందులో భాగంగానే నోయిడా ప్రాంత రూపురేఖలను మార్చేందుకు ఓ విస్తృతమైన ప్రణాళికను రూపొందించింది. కేవలం పారిశ్రామికంగానే కాకుండా ఆధునిక సదుపాయాలతో కూడిన ఆధునిక నగరంగా నోయిడాను మార్చే ప్రయత్నంలో వుంది యూపి ప్రభుత్వం. ఈ క్రమంలో నోయిడాలో వైబ్రెంట్ కల్చరల్ స్పేస్‌లను గుర్తించి వాటి అభివృద్ధి ప్రక్రియకు వేగం తీసుకురావడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

నోయిడా ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ దిశగా అడుగులు వేస్తూ నాలెడ్జ్ పార్టనర్‌ను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీని ద్వారా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ప్రక్రియకు మరింత వేగం లభిస్తుంది. టాస్క్ ఫోర్స్‌లో అథారిటీ,  జిల్లా స్థాయిలోని వివిధ అధికారులు కూడా ఉంటారు. వివిధ ప్రాజెక్టుల పురోగతి నివేదికలు, పర్యవేక్షణ, వివరాలను సేకరించడం ద్వారా డేటాబేస్‌ను రూపొందించడం, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం, పర్యాటక ఆకర్షణలను అభివృద్ధి చేయడం వంటి బాధ్యతలను ఈ టాస్క్ ఫోర్స్ నిర్వర్తిస్తుంది.

Latest Videos

నోయిడాను శక్తివంతమైన, స్వయం సమృద్ధి నగరంగా గుర్తించడం

పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రపంచ వాణిజ్యానికి మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్న నోయిడా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో ఒక ముఖ్యమైన భాగం. అయితే అభివృద్ధి చెందుతున్న అనేక నగరాలు ఎదుర్కొనే కొన్ని సవాళ్లను నోయిడా ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను అధిగమించడం ద్వారా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది యూపీ సర్కార్. 

నోయిడాను శక్తివంతమైన, స్వయం సమృద్ధి, నివాసయోగ్యమైన నగరంగాా తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం. నోయిడా బ్రాండింగ్ కేవలం పారిశ్రామికరణకే పరిమితం కాదు ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలు గల  'డైనమిక్ సిటీ'గా తయారుచేయనున్నారు. ఇక్కడ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, సెల్ఫీ పాయింట్లను తీర్చిదిద్దనున్నారు. ఇలాంటి ప్రదేశాలను గుర్తించడం, అవసరమైన అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. ఇలాంటి ప్రాంతాలకు ప్రచారం కల్పించి బ్రాండింగ్‌ చేయనుంది యోగి సర్కార్.  

 టాస్క్ ఫోర్స్ పనితీరు

సీఎం యోగి విజన్ ప్రకారం... టాస్క్ ఫోర్స్ నోయిడా బ్రాండింగ్ కోసం యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తుంది. అంటే నోయిడా ప్రత్యేకతలు గుర్తించడం, వాటిని వివిధ స్థాయిలలో అభివృద్ది చేయడం, ప్రచారం చేయడం చేస్తారు. ఇలా సరికొత్త వ్యూహాలను అథారిటీ, జిల్లా యంత్రాంగంతో పంచుకుంటారు, ఆ తర్వాత వీటి అమలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రజా భాగస్వామ్యం, వాణిజ్య పెట్టుబడి అవకాశాలు,  పర్యాటక ప్రచారంపై కూడా దృష్టి సారించబడుతుంది. సెప్టెంబర్ మూడో వారం నుండి ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

click me!