
కర్ణాటక : కర్ణాటకలోని రామ్‌నగర్ జిల్లాలో కంచుగల్ బండే మఠానికి చెందిన స్వామిజీ ఒకరు మఠం ఆవరణలో శవమై కనిపించాడు. అతని మృతదేహం లభించిన గదిలో రెండు పేజీల లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిమీద తదుపరి విచారణలు జరుగుతున్నాయి. మరణించిన వ్యక్తిని కంచుగల్ బండే మఠానికి చెందిన బసవలింగ స్వామిగా గుర్తించారు. మృతదేహంతో పాటు రెండు పేజీల సూసైడ్ నోట్ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. అక్టోబర్ 24, సోమవారం నాడు ఓ స్వామీజీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీనికి సంబంధించి కూడూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రామనగర జిల్లాలోని మఠం గదిలో స్వామీజీ మృతదేహం లభించిన రెండు పేజీల డెత్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిమీద కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు.
తీవ్రరూపం దాల్చిన సిత్రాంగ్ తుఫాను.. పశ్చిమ బెంగాల్‌లో ఆరెంజ్ అలర్ట్
పోలీసులు అతడు చివరగా మాట్లాడిన ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేస్తున్నారు. మృతదేహం దగ్గర దొరికిన సూసైడ్ లెటర్ లో తనను కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తనను పదవి నుంచి తొలగించాలని వేధిస్తున్నారని ఉన్నట్టుగా రాసి ఉంది. బసవలింగ స్వామి 25 సంవత్సరాల పాటు ఈ మఠానికి ప్రధానార్చకులుగా ఉన్నారు. కుదూరు పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదైంది.
ఉదయం 6 గంటల సమయంలో కిటికీకి వేలాడుతూ కనిపించారని ఓ పత్రికలో వచ్చిన కథనం తెలిపింది. కొంతమంది వ్యక్తులు కొన్ని సమస్యలపై స్వామీజీని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నట్లు పేర్కొంది.
బండే మట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్న ఓ వ్యక్తి స్వామీజీ ఆత్మహత్యకు సంబంధించి మొదట చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని పేరు రమేష్, అతను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లేముందు స్వామీజీని కలిశానని పోలీసులకు చెప్పాడు. ఉదయం 6.10 గంటల ప్రాంతంలో స్వామీజీ గది తలుపులు తెరవడం లేదని, కాల్స్ తీసుకోవడం లేదని మఠం ఉద్యోగి నుంచి అతనికి కాల్ వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న రమేష్.. గది వెనుకకు వెళ్లి చూడగా స్వామీజీ ఉరివేసుకుని కనిపించాడు. మఠం ఆవరణలో ఆయన అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి.