దేశద్రోహం, ఉపాలను ‘ప్రసాదం’లా పంచిపెడుతున్నారు.. మమతతో స్వర భాస్కర్

Published : Dec 02, 2021, 11:07 AM ISTUpdated : Dec 02, 2021, 11:20 AM IST
దేశద్రోహం, ఉపాలను ‘ప్రసాదం’లా పంచిపెడుతున్నారు.. మమతతో స్వర భాస్కర్

సారాంశం

మమతా బెనర్జీ, మూడు రోజుల ముంబై పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా, పౌర సమాజ సభ్యులతో సంభాషించారు. ఆ సందర్భంగా వేదిక పంచుకున్న నటి స్వరా భాస్కర్ మాట్లాడుతూ  "ఓ రాష్ట్రం ప్రతీ చిన్న దానిమీద UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నిరోధక) చట్టం) ఉపయోగిస్తుంది. దేశద్రోహ ఆరోపణలను చేస్తుంది. వీటిని  దేవుడి ప్రసాదంలా పంచిపెడుతున్నారు’ అని స్వరా భాస్కర్ అన్నారు.

ముంబై : కళాకారులు తమ "కథలు చెప్పడం" కష్టమవుతోందని, ప్రభుత్వం దేశద్రోహ చట్టం, యుఎపిఎ నిబంధనలను విచక్షణారహితంగా ఉపయోగిస్తోందని నటి Swara Bhasker పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjeeతో బుధవారం ఇక్కడ జరిగిన సంభాషణలో అన్నారు.

మమతా బెనర్జీ, మూడు రోజుల mumbai పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా, పౌర సమాజ సభ్యులతో సంభాషించారు. ఆ సందర్భంగా వేదిక పంచుకున్న నటి స్వరా భాస్కర్ మాట్లాడుతూ  "ఓ రాష్ట్రం ప్రతీ చిన్న దానిమీద UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నిరోధక) చట్టం) ఉపయోగిస్తుంది. Sedition Charges చేస్తుంది. వీటిని  దేవుడి ప్రసాదంలా పంచిపెడుతున్నారు’ అని స్వరా భాస్కర్ అన్నారు.

"ఈరోజు కళాకారులు కథలు చెప్పడంలో చాలా ప్రతిఘటనలను ఎదుర్కొంటున్నారు. ప్రతిఘటనను సజీవంగా ఉంచడానికి తమ జీవనోపాధిని, వృత్తిని పణంగా పెట్టిన వారు చాలా మంది ఉన్నారు" అని సోషల్ మీడియాలో రాజకీయ, సామాజిక సమస్యలపై తరచుగా గళం విప్పే ఈ నటి చెప్పుకొచ్చింది.

హాస్యనటులు మునవర్ ఫరూఖీ, అదితి మిట్టల్, అగ్రిమా జాషువాలను మితవాద గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయి.  ఇక మత మనోభావాలను దెబ్బతీశారన్న కారణంతో మునవర్ ఫరూఖీ ఒక నెల జైలులో గడిపారు అని ఆమె ఎత్తి చూపారు.

కొంతమంది హాస్యనటులకు ఆతిథ్యం ఇచ్చినందుకు వేదికను ధ్వంసం చేసిన సందర్భం కూడా ఉందని స్వరా భాస్కర్ చెప్పారు. సాధారణ పౌరులు "unaccountable mob"ను ఎదుర్కొంటున్నారు. దీనిని పాలక యంత్రాంగం ఉపయోగించుకుంటుంది, అయితే పోలీసులు, రాష్ట్రం ఇలాంటి వాటికి స్వేచ్ఛా నియంత్రణను ఇస్తోందని ఆమె ఆరోపించారు.

UAPA చాలా దుర్వినియోగం చేయబడిందని మమతా బెనర్జీ అన్నారు. "UAPA అనేది సాధారణ పౌరుల మీద ప్రయోగించడానికి కాదని, బాహ్య శక్తుల నుండి రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం" అని ఆమె అన్నారు.

ఇంతకుముందు నవంబర్ లో స్వరా భాస్కర్ అనవసరమైన విషయాలను ప్రస్తావించి తన కాంట్రాక్టుల రద్దుకు కారణం అయ్యిందని.. తన మాటలే తనకు శిక్ష పడేలా చేశాయని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటంటే.. కొంతకాలం క్రితం మోడీ సర్కార్ తీసుకువచ్చిన సీఏఏ చట్టాన్ని గురించి ప్రస్తావించి స్వరా భాస్కర్ చిక్కుల్లో పడింది. 

Mamata Banerjee: జాతీయ గీతాన్ని కూడా సరిగ్గా పాడలేరు.. దేశభక్తి అంటే ఇదేనా?: మమతా‌ బెనర్జీపై బీజేపీ ఫైర్

దీనిమీద తను వ్యాఖ్యనించిందుకు చాలా కమర్షియల్ బ్రాండ్స్ తనతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటే తమ ఉత్పత్తులకు చెడ్డ పేరు వస్తుందని ాయా కంపెనీలు తమ ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పింది. 

అయితే కంపెనీలు ఇలా చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గనని చెప్పుకొచ్చారు. ఈ దేశంలో రాజ్యాంగం అనేది అత్యున్నతమైనదని, ఎవరూ దాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు తాను ఒకదాన్ని మంచి అని నమ్మితే.. దానికోసం ఎంతవరకైనా వెడతానని చెప్పింది. దానివల్ల వ్యక్తిగతంగా తనకు నష్టం కలిగినా పరవాలేదని చెప్పుకొచ్చింది.  అంతేకాదు సమాజానికి కలిగే నష్టంతో పోల్చితే తనకు కలిగే నష్టం పెద్ద నష్టమేమీ కాదని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌