లోక్ సభలో భద్రతా ఉల్లంఘన.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా అరెస్టు..

By Sairam Indur  |  First Published Dec 15, 2023, 1:27 PM IST

లోక్ సభ భద్రతా ఉల్లంఘన (lok sabha security breach) ఘటనలో కీలక నిందితుడు లలిత్ మోహన్ ఝా (Lalit Mohan Jha)ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడు పోలీసుల ఎదుట లొంగిపోగా.. అదుపులోకి తీసుకున్నారు. అతడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడు.


లోక్ సభ లో జరిగిన భద్రతా ఉల్లంఘన ఒక్క సారిగా దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. పటిష్టమైన బందోబస్తు ఉండే పార్లమెంట్ లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన లలిత్ మోహన్ ఝా ను గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు.

ఈ ఘటనలో సూత్రధారి అయిన లలిత్ మరో వ్యక్తితో కలిసి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా, అక్కడ అతన్ని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి అప్పగించారు. కాగా.. భారీ భద్రతా ఉల్లంఘనకు పాల్పడినందుకు నలుగురు వ్యక్తులపై కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఎపిఎ) కింద తీవ్రవాదం అభియోగాలు మోపారు. ఈ నలుగురిలో సాగర్ శర్మ, మనోరంజన్ డి అనే ఇద్దరు లోక్ సభ ఛాంబర్ లోకి స్మోక్ బాక్స్ లను తీసుకొచ్చినవారు. మిగిలిన ఇద్దరు నీలం దేవి, అన్మోల్ షిండే బయట నిరసన తెలిపారు.

Latest Videos

undefined

గురువారం రాత్రి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన లలిత్ మోహన్ ఝా బుధవారం పార్లమెంటు దాడి వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభ భద్రతా ఉల్లంఘనకు సూత్రధారిగా భావిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అతడి అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. దాడికి సంబంధించిన వీడియోను ఝా తన సహచరుడితో వాట్సప్ లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే లలిత్ నుంచి ఎలాంటి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోలేదని, రాజస్థాన్ లోని ఇతర నిందితుల నాలుగు ఫోన్లను అతను ధ్వంసం చేసి ఉంటాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. లోక్ సభ సమావేశం ముగిసిన తర్వాత లలిత్ కుచమన్ కు వెళ్లి అక్కడ తన స్నేహితుడు మహేష్ ను కలుసుకుని లలిత్ రాత్రి బస చేసేందుకు గదిని ఏర్పాటు చేశాడు.

సాగర్ శర్మ (26), మనోరంజన్ డి (34), అమోల్ షిండే (25), నీలం దేవి (37) అనే నలుగురిపై పోలీసులు కఠినమైన యూఏపీఏ (ఉపా) కింద ఉగ్రవాద అభియోగాలు నమోదు చేశారు. ఉగ్రవాద చర్యకు శిక్ష (సెక్షన్ 16), కుట్రకు శిక్ష (సెక్షన్ 18), నేరపూరిత కుట్ర (ఐపీసీ 120బి), అతిక్రమణ (452), అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం (153), ప్రభుత్వ విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం (186), ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ బలప్రయోగం (353) వంటి అభియోగాలు ఉన్నాయి.

నిందితుడు పార్లమెంటుకు చేరుకునే ముందు గురుగ్రామ్ లో బస చేసిన విశాల్ శర్మ అలియాస్ విక్కీ ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నాడు. కాగా.. దాడి చేసిన నిందితులందరికీ ఒకే భావజాలం ఉందని పోలీసులు చెబుతున్నారు. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. వీరంతా ప్రభుత్వానికి సందేశం ఇవ్వాలని, దేశం దృష్టిని ఆకర్షించే చర్యకు పాల్పడాలనుకున్నాడని చెప్పారు. రైతుల నిరసన, మణిపూర్ లో జాతి సంఘర్షణ, నిరుద్యోగం వంటి సమస్యలతో తాము కలత చెందామని, అందుకే తాము ఈ చర్యకు పాల్పడినట్లు విచారణలో వారు దర్యాప్తు అధికారులకు చెప్పారు. వీరంతా సోషల్ మీడియాలో కలుసుకున్నారు. ఈ ఆరుగురూ ఫేస్ బుక్ లోని భగత్ సింగ్ ఫ్యాన్ పేజ్ లో సభ్యులు. 

click me!