బీహార్ సీఎం నితీష్‌ భద్రతా వలయంలోకి దూసుకొచ్చిన బైక్.. ఫుట్‌పాత్‌పైకి దూకిన సీఎం..

Published : Jun 15, 2023, 11:55 AM IST
బీహార్ సీఎం నితీష్‌ భద్రతా వలయంలోకి దూసుకొచ్చిన బైక్.. ఫుట్‌పాత్‌పైకి దూకిన సీఎం..

సారాంశం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన సమయంలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయాన్ని  చేధించుకుని సీఎం నితీష్ కుమార్‌కు సమీపంలోకి వచ్చారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన సమయంలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయాన్ని  చేధించుకుని సీఎం నితీష్ కుమార్‌కు సమీపంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన నివాసం నుంచి సర్క్యులర్‌ రోడ్డులోని సర్క్యులర్‌ హౌసింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  నితీష్ కుమార్ మార్నింగ్ వాక్ చేసే మార్గమైన సర్క్యులర్ రోడ్‌లోకి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

బైక్‌పై వచ్చిన వ్యక్తులు నితీష్ వైపు రావడంతో ఆయన భద్రత కోసం వేగంగా రోడ్డుపై నుంచి ఫుట్‌పాత్‌పైకి దూకాల్సి వచ్చింది. ఇక, బైక్‌పై వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. “మాజీ సీఎం రబ్రీ దేవితో సహా పలువురు రాజకీయ నాయకులు నివసించే సర్క్యులర్ రోడ్ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు యువకులు తమ మోటార్‌సైకిల్‌ను వేగంగా నడుపుతూ తన సెక్యూరిటీ కవర్‌లోకి ప్రవేశించడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా ఫుట్‌పాత్‌పైకి దూకారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్