PM Security lapse: ముమ్మాటికీ కుట్రే… ప్ర‌ధాని పంజాబ్ ప‌ర్య‌ట‌న అడ్డుకోవ‌డంపై కిర‌ణ్ బేడీ

Published : Jan 08, 2022, 04:04 PM IST
PM Security lapse: ముమ్మాటికీ కుట్రే… ప్ర‌ధాని పంజాబ్ ప‌ర్య‌ట‌న అడ్డుకోవ‌డంపై కిర‌ణ్ బేడీ

సారాంశం

PM security lapse: ప్ర‌ధాని మోడీ పంజాబ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో త‌లెత్తిన భ‌ద్ర‌తా వైఫ‌ల్య అంశం తీవ్ర చ‌ర్చ‌కు తెర‌దీసింది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ ల మ‌ధ్య పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. ఈ నేప‌థ్యంలోనే స్పందించిన మాజీ గ‌వ‌ర్న‌ర్‌, మాజీ ఐపీఎస్ అధికారి కిర‌ణ్ బేడీ.. ఇది ముమ్మాటికీ కుట్రేన‌ని ఆరోపించారు.   

PM security lapse: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పంజాబ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో  హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకోవ‌డంతో ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై ఇరుక్కుపోయారు. ఈ భ‌ద్ర‌తా వైఫ‌ల్య అంశం (Security Lapse) తీవ్ర చ‌ర్చ‌కు తెర‌దీసింది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ ల మ‌ధ్య పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. ఈ నేప‌థ్యంలోనే స్పందించిన పుదుచ్చేరి మాజీ గ‌వ‌ర్న‌ర్‌, మాజీ ఐపీఎస్ అధికారి కిర‌ణ్ బేడీ (Kiran Bedi).. ఇది ముమ్మాటికీ కుట్రేన‌ని ఆరోపించారు. ఈ అంశాన్ని వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పంజాబ్‌ రాష్ట్ర డీజీపీ హాజ‌రు కాక‌పోవ‌డ‌మే తొలి భద్ర‌తా వైఫ‌ల్య‌మని ఆమె అన్నారు. డీజేపీయే కాకుండా హోంమంత్రి, హోంశాఖ కార్య‌ద‌ర్శి కూడా హాజ‌రు కాలేద‌న్నారు. చివ‌ర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ కూడా గైర్హాజ‌ర‌య్యార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇదంతా ముంద‌స్తు ప్రణాళిక‌తో చేసిన కుట్ర కాదా? అంటూ Kiran Bedi సూటిగా ప్ర‌శ్నించారు. ఇదంతా కూడా ఓ కుట్రేన‌ని కిర‌ణ్ బేడీ ఆరోపించారు.

పంజాబ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై కిర‌ణ్ బేడీ మాట్లాడుతూ.. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని భద్రపరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన పంజాబ్ పోలీసులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.  ఇదిలావుండ‌గా, పంజాబ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌లెత్తిన భ‌ద్ర‌తా వైఫ‌ల్య (Security Lapse) అంశం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ అంశం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని మ‌రింత‌గా పెంచింది. బీజేపీ నేత‌లు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ బీజేపీ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ.. బీజేపీ నేత‌ల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పంజాబ్ నుంచి ప్ర‌ధాని మోడీ (PM Narendra Modi) ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు కానీ, సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న చేసిన 700 మంది రైతులు మాత్రం క్షేమంగా ఇళ్ల‌కు చేర‌లేక‌పోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ప్ర‌ధాని మోడీకి, నియంత హిట్ల‌ర్‌కు ఎలాంటి తేడా లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

పంజాబ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా  ''ప్రధాని కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకునేటప్పటికి కొందరు నిరసనకారులు రోడ్డును దిగ్బంధించినట్టు గుర్తించారు. ప్రధాని ఫ్లైఓవర్‌పైనే 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ఇది కీలకమైన లోపం''అని హోం మంత్రిత్వ శాఖ త‌న ప్రకటనలో పేర్కొంది. ప్ర‌ధాని మోడీ (PM Narendra Modi) భ‌ద్ర‌త‌కు సంబంధించి అంశం కావ‌డంతో ఇది కోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులోనూ వాడిగా వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష సాక్షి(Eye Witness)గా ఉన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (Retired IAS Officer) ఎస్ఆర్ లాధార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పోలీసులే ధర్నా చేశారని, ప్రధాని మోడీ భద్రతకు వీరే ముప్పు కలిగించారని ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu