Dates For Assembly Elections In 5 States : కోవిడ్ సోకితే బ్యాలెట్ ద్వారా ఓటుకు అనుమతి

Siva Kodati |  
Published : Jan 08, 2022, 03:51 PM ISTUpdated : Jan 08, 2022, 04:02 PM IST
Dates For Assembly Elections In 5 States : కోవిడ్ సోకితే బ్యాలెట్ ద్వారా ఓటుకు అనుమతి

సారాంశం

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (5 state Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల  చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. 

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (5 state Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల  చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో..  ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చి నెలలో వివిధ తేదీల్లో ముగియనున్నాయి. యూపీలో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అయితే గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు.. ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా ప్రధాని మోదీని, ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం.. ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు.. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే ప్రధాన ఎన్నిక కమిషనర్ సుశీల్ చంద్ర ఇటీవల మాట్లాడుతూ.. ఎన్నికలు వాయిదా వేయవద్దని పార్టీలు కోరాయని.. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. 

మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని సీఈసీ చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 18.34 కోట్ల మంది ఓటర్లు వున్నట్లు ఈసీ వెల్లడించింది. అన్ని చోట్లా మహిళా ఓటర్లు పెరిగినట్లు సీఈసీ పేర్కొంది. పోలింగ్ స్టేషన్‌లలో అన్ని ఏర్పాట్లపై సమీక్షించామని.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు సుశీల్ చంద్ర తెలిపారు. కరోనా పెరుగుతున్నందున ఆరోగ్య శాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపినట్లు ఆయన చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో 2 లక్షల 15 వేల 368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. సున్నీత ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. కోవిడ్ కారణంగా పోలింగ్  స్టేషన్ల సంఖ్య తగ్గించామని.. ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్ధులకు నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. 

కోవిడ్ సోకిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని సుశీల్ చంద్ర తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల పరిశీలకులు వుంటారని ఆయన చెప్పారు. క్రిమినల్ చరిత్ర వుండి పోటీ చేసే అభ్యర్ధులకు సీట్లు ఇవ్వడానికి కారణాలను ఆయా పార్టీలు తెలియజేయాలని సీఈసీ స్పష్టం చేశారు. ఒక్కో అభ్యర్ధికి 28 లక్షల నుంచి రూ.40 లక్షలకు ఖర్చు పెంచుతున్నట్లు తెలిపారు. దోషులుగా వుండి పోటీ చేసే అభ్యర్ధులు గత చరిత్ర  తెలియజేయాలని సీఈసీ వెల్లడించారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ అభ్యర్ధులు రూ.40 లక్షలు ఎన్నికల వ్యయం చేససేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. గోవా, మణిపూర్‌లో అభ్యర్ధుల వ్యయం లిమిట్ 28 లక్షలకు పెంచుతున్నట్లు సీఈసీ వెల్లడించారు. డబుల్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఎన్నికల డ్యూటీ వేస్తామన్నారు. గోవాలో 97 శాతం మంది డబుల్ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఉత్తరాఖండ్‌లో 99 శాతం మొదటి డోస్ తీసుకున్నారని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?