ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌కు సెబీ షాక్: 27 కోట్ల జరిమానా

Siva Kodati |  
Published : Dec 25, 2020, 02:19 PM IST
ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌కు సెబీ షాక్: 27 కోట్ల జరిమానా

సారాంశం

ఎన్‌డీటీవీకి చెందిన ప్రణయ్ రాయ్ సహా ప్రమోటర్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబి మరోసారి షాకిచ్చింది. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌తో పాటు వారి నిర్వహణలో వున్న ఆర్‌ఆర్‌పీ‌ఆర్ హోల్డింగ్ కంపెనీపై రూ. 27 కోట్ల జరిమానా విధించింది. 

రెండు రుణ ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వాటాదారులకు బహిర్గతం చేయకుండా దాచిపెట్టినందుకు సెబీ ఈ చర్యలు తీసుకుంది. దీనిపై క్వాంటమ్ సెక్యూరిటీస్ సంస్థ 2017 లో ఇందుకు సంబంధించి సెబీకి ఫిర్యాదు చేసింది. క్వాంటమ్ సెక్యూరిటీస్... ఎన్డీటీవీ వాటాదారుల్లో ఒకరు. 

దర్యాఫ్తులో ఇది వాస్తవంగా తేలడంతో సెబీ ఈ చర్యలు తీసుకుంది. రుణ ఒప్పందాలకు సంబంధించి  వాటాదారులకు సమాచారాన్నివ్వకుండా వివిధ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎన్‌డీటీవీ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్‌పై ఇంత భారీ జరిమానాను విధించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..