కేరళ ప్రమాదం.. రక్తంతో తడిచిన దుస్తులు, భయంకరమైన ఏడుపులు

By telugu news teamFirst Published Aug 8, 2020, 8:49 AM IST
Highlights

ఆ విమానం నుంచి ప్రయాణికులు తీవ్రగాయాలతో రక్తమోడుతూ కనిపించారని రెస్క్యూ  సిబ్బంది చెప్పారు. కాగా.. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది చాలానే శ్రమించారు.

కేరళ లో గత రాత్రి ఘోర విమాన ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ప్రమాద సంఘటనాస్థలం వద్ద భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో చాలా మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలయ్యారు. కాగా.. ఆ గాయాలతో వారు నొప్పులతో పెడుతున్న అరుపులు.. ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ నెత్తురోడుతూ.. రక్తంతో తడిచిపోయిన దుస్తులతో కనిపించారు. అంబులెన్స్ సైరన్ లతో ఆ ప్రదేశం మారిమోగిపోయింది. కాగా.. ఈ ఘటనతో  చిన్నారులు భయంతో వణికిపోయారని అధికారులు  చెబుతున్నారు.

భారీ వర్షం కారణంగా విమానం ప్రమాదానికి గురైందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ క్రమంలో విమానం రెండు ముక్కలైపోవడం గమనార్హం. దీంతో.. ఆ విమానం నుంచి ప్రయాణికులు తీవ్రగాయాలతో రక్తమోడుతూ కనిపించారని రెస్క్యూ  సిబ్బంది చెప్పారు. కాగా.. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది చాలానే శ్రమించారు.

కాగా.. ఆ విమానంలోని ప్రయాణికులకు అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా అర్థం కాలేదు. గాయాలతో ఉన్నవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఇప్పటికీ వాళ్లు ఆ షాక్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. విమానంలో నాలుగు, ఐదు సంవత్సరాల వయసు చిన్నారులే ఎక్కువగా ఉన్నారని.. వారంతా ఆ ఘటనలను చూసి చాలా భయపడిపోయారని వైద్యులు చెబుతున్నారు.

కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే... వారిని రక్షించేందుకు స్థానికులు కూడా అక్కడికి పరుగులు తీయడం గమనార్హం. చాలా మంది చిన్నారులు విమానంలోని సీట్ల కింద ఇరుక్కుపోయారని.. వారిని బయటకు తీసేందుకు చాలా కష్టమైందని వారు చెప్పారు.

click me!