కేరళ ప్రమాదం: పైలట్ గతంలో యుద్ధ విమానాలను నడిపిన నిష్ణాతుడు

By team teluguFirst Published Aug 8, 2020, 7:40 AM IST
Highlights

కేరళ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 20 కి చేరుకుంది. ఈ ప్రమాదంలో విమాన పైలట్ దీపక్ వసంత్, కో పైలట్ అఖిలేష్ కుమార్ లు కూడా మృత్యువాత పడ్డారు. పైలట్ గా వ్యవహరించిన దీపక్ సాఠే గతంలో భారత వాయుసేనలో వింగ్ కమాండర్ స్థాయి అధికారి. యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉన్న వ్యక్తి. 

నేషనల్ డిఫెన్సె అకాడమీ నుండి పట్టభద్రుడైన దీపక్, బోయింగ్ విమానం నడపడంలో అత్యంత నిష్ణాతుడు. ఎన్డీఏ లో ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ స్వీకరించాడు. పాసెంజర్ విమానాలను నడిపే ముందు ఈయన ఎయిర్ ఫోర్స్ పైలట్ గా పనిచేసాడు. 

కమర్షియల్ పైలట్ గా మారిన తొలినాళ్లలో ఆయన ఎయిర్  బస్ విమానానికి పైలట్ గా వ్యవహరించేవాడు. కో పైలట్ గా వ్యవహరించిన అఖిలేష్ కుమార్ గత సంవత్సరమే పెళ్లయింది. 

వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి కేరళలోని కాలికట్ వస్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వర్షం కురుస్తుండడంతో విమానం ల్యాండ్ చేసే సమయంలో జోరు వర్షం కురుస్తుండడంతో విమానం రన్ వే మీద నుండి స్కిడ్ అయి కింద పడి రెండు ముక్కలయింది. 

విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా విమానం ప్రయాణికులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రకటించింది.

click me!