Heatwave: ఉత్తర భారతంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బల్లియా, బీహార్ లో గత మూడు రోజుల్లో ఈ మరణాలు సంభవించాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
scorching sun with north India: ఉత్తర భారతంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బల్లియా, బీహార్ లో ఈ మరణాలు సంభవించాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బల్లియాలో జరిగిన మరణాలపై యూపీ ప్రభుత్వం విచారణ చేపట్టి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దివాకర్ సింగ్ ను బదిలీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలో గత మూడు రోజుల్లో కొనసాగుతున్న వడగాల్పుల కారణంగా 54 మంది, బీహార్ లో 44 మంది ప్రాణాలు కోల్పోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
బల్లియాలో సంభవించిన మరణాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దివాకర్ సింగ్ ను ఆజంగఢ్ కు బదిలీ చేసింది. ఆయనను అజంగఢ్ డివిజన్ అదనపు డైరెక్టర్ (హెల్త్)గా నియమించారు. కేవలం బల్లియా మాత్రమే వడగాల్పుల తాకిడికి తీవ్రంగా గురికావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, యూపీతో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పలు జిల్లాలు కూడా తీవ్రమైన వేడితో వణికిపోతున్నాయని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి.
యూపీ, బిహార్ లో వడగాల్పులకు సంబందించి టాప్ అప్డేట్స్:
బల్లియాలోని జిల్లా ఆసుపత్రిలో చేరిన కనీసం 54 మంది జూన్ 15, 16, 17 మధ్య మండుతున్న వేడిమి, వడగాల్పులతో మరణించారు.
రోగుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు తెలిపారు.
జూన్ 15న 23 మంది చనిపోగా, జూన్ 16 మధ్యాహ్నం వరకు 11 మంది మరణించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే, శుక్రవారం మరో 10 మంది మరణించారని ఆసుపత్రి సీనియర్ అధికారి తెలిపారు.
శనివారం, బల్లియాలో మరో 10 మరణాలు నమోదయ్యాయి.
శనివారం, బల్లియా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 43°C, సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. అలాగే, 25% సాపేక్ష ఆర్ద్రత నమోదైంది, ఇది వేడి ప్రభావాన్ని తీవ్రతరం చేసింది.
డాక్టర్ ఎస్కే యాదవ్‌కు బల్లియా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.
"వ్యక్తులందరూ కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా వారి పరిస్థితి మరింత దిగజారింది" అని బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయంత్ కుమార్ శనివారం అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియా వల్లే ఎక్కువ మంది మరణించారని ఆయన తెలిపారు.
బీహార్‌లో సంభవించిన 44 మరణాలలో 35 మంది పాట్నాలోనే మరణించారు. నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (NMCH)లో 19 మంది, PMCHలో 16 మంది రోగులు మరణించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తొమ్మిది మంది మరణించారని ఇండియా టుడే నివేదించింది.
రోజువారీ వాతావరణ బులెటిన్ ప్రకారం, షేక్‌పురా గరిష్ట ఉష్ణోగ్రత 45.1°C, పాట్నా 44.7°C, గయా 44.1°C, పశ్చిమ చంపారన్ 44.4°C, భోజ్‌పూర్ 44.5°C, ఔరానాగాబాద్ 44.8°Cతో రాష్ట్రంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలుగా ఉన్నాయి.
పాట్నాలోని అన్ని పాఠశాలలు జూన్ 24 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.