ఫణి తుఫాను... పూరీ భక్తులకు ప్రత్యేక రైలు

By telugu teamFirst Published May 2, 2019, 12:13 PM IST
Highlights

‘ఫణి’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. మరికాసేపట్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో..ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. 


‘ఫణి’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. మరికాసేపట్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో..ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న భక్తులను వారి స్వస్థలాలకు తరలించేందుకు గురువారం రైల్వేఅధికారులు ప్రత్యేక రైలు నడపనున్నారు. 

తుపాన్ హెచ్చిరికలతో ముందుజాగ్రత్త చర్యగా 103 రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. దీంతో పూరి నగరంలో పెద్ద ఎత్తున పర్యాటకులు నిలిచిపోయారు.పూరి పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. తీవ్ర పెనుతుపాను గండం పొంచి ఉన్న నేపథ్యంలో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒడిశా సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.

భక్తులు వెళ్లిపోయేందుకు వీలుగా రైల్వేశాఖ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పూరి నుంచి బయలుదేరి ఖుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, జైపూర్, కేందుఝర్ రోడ్డు, భాద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్‌ల మీదుగా షాలిమార్ కు నడపనున్నారు.

click me!