స్కూల్ గోడ కూలి విద్యార్థి మృతి.. ప‌లువురికి గాయాలు

Published : Sep 22, 2023, 04:27 PM IST
స్కూల్ గోడ కూలి విద్యార్థి మృతి.. ప‌లువురికి గాయాలు

సారాంశం

school wall collapse: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ గోడ కూలి ఒక‌ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ప‌లువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటుచేసుకుంది. క‌ర్నాట‌క‌లోని రామనగర జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల గోడ కూలిన ఘటనలో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.

Karnataka residential school wall collapses: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ గోడ కూలి ఒక‌ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ప‌లువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటుచేసుకుంది. క‌ర్నాట‌క‌లోని రామనగర జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల గోడ కూలిన ఘటనలో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కర్నాట‌క‌లోని రామనగర జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల గోడ కూలిపోవడంతో 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. అలాగే, అతని సహవిద్యార్థులలో ఇద్దరికి తీవ్ర‌ గాయాలయ్యాయి. జిల్లాలోని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన విద్యార్థిని 6వ తరగతి చదువుతున్న కౌశిక్ గౌడగా గుర్తించారు.

గోడ కూల‌డంతో విద్యార్థి త‌ల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు బ‌య‌ట‌ప‌డ్డారు. గాయపడిన ఇతర విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్‌ నారాయణ్‌.. "ప్రభుత్వ అధికారులతో సహా బాధ్యులైన ప్రతి ఒక్కరిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. నిర్వహణ సరిగా లేకపోవడంతో ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు" అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?