బస్సులు లేవు.. పాఠశాలకు ఎలా వెళ్లాలి, రోడ్డుపై బైఠాయించి విద్యార్ధుల నిరసన.. హామీ ఇస్తేనే కదిలేది

Siva Kodati |  
Published : Aug 23, 2023, 02:29 PM IST
బస్సులు లేవు.. పాఠశాలకు ఎలా వెళ్లాలి, రోడ్డుపై బైఠాయించి విద్యార్ధుల నిరసన.. హామీ ఇస్తేనే కదిలేది

సారాంశం

తమిళనాడుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు తమకు బస్సు సదుపాయం కల్పించాలంటూ నిరసనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు బస్సు కదలడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. 

తమిళనాడుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు తమకు బస్సు సదుపాయం కల్పించాలంటూ నిరసనకు దిగారు. ధర్మపురి జిల్లా ఏరియూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు సోమవారం సిలనాయకనూర్ గ్రామంలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్ధులు పాఠశాలకు వెళ్లేందుకు ప్రభుత్వ బస్సులపైనే ఆధారపడుతున్నారు. 

విద్యార్ధులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఉదయం ఒక ప్రభుత్వ బస్సు మాత్రమే నడుస్తుందని, కానీ సాయంత్రం మాత్రం ఎలాంటి రవాణా సదుపాయం లేదని వాపోతున్నారు. ఈ బస్సు సర్వీసు లేకపోవడం వల్ల వారు పాఠశాలకు వెళ్లడం కష్టంగా మారింది. కొందరు విద్యార్ధులు తరగతులకు హాజరయ్యేందుకు దాదాపు 10 కి.మీల వరకు నడిచి వెళ్లాల్సి వస్తోంది. తమ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో సిలనాయకనూర్‌కు చెందిన విద్యార్ధులు రహదారిపై బైఠాయించి బస్సును అడ్డుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు బస్సు కదలడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu