అంతరిక్ష అన్వేషణలో భారత్ ముందంజలో ఉండటం ఆనందంగా ఉంది - భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్

Published : Aug 23, 2023, 02:12 PM IST
అంతరిక్ష అన్వేషణలో భారత్ ముందంజలో ఉండటం ఆనందంగా ఉంది - భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్

సారాంశం

చంద్రయాన్ -3 ప్రయోగం చేపట్టిన ఇస్రోను, భారత్ ను భారత సంతతికి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రశంసించారు. ఈ ప్రయోగం కోసం తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో, చంద్రుడిపై సుస్థిర జీవనం కోసం భారత్ ముందంజలో ఉన్నందుకు తాను సంతోషిస్తున్నాని అన్నారు. 

చంద్రయాన్ -3 నేడు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. ఈ అద్భుతమైన క్షణాలను చూసేందుకు భారత్ తో పాటు ప్రపంచం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ ల్యాండింగ్ కు ముందు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా చాలా సంతోష్యం వ్యక్తం చేశారు. భారత్ చేపట్టిన మూన్ మిషన్ పట్ల తనకు చాలా ఉత్సాహంగా ఉందని చెప్పారు. 

చంద్రయాన్ -3 జాబిల్లిపై కాలు మోపడానికి సిద్దమవుతున్న తరుణంలో ఆమె ‘నేషనల్ జియోగ్రాఫిక్ ఇండియా’తో మాట్లాడారు. చంద్రుడిపై అన్వేషణకు ఉన్న ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. ఇది జ్ఞానం కోసం మాత్రమే కాదని, మన గ్రహం వెలుపల స్థిరమైన జీవనం కోసం కూడా అని అన్నారు. 

‘‘చంద్రుడిపై దిగడం వల్ల మనకు అమూల్యమైన అంతర్దృష్టులు లభిస్తాయి. అంతరిక్ష అన్వేషణలో, చంద్రుడిపై సుస్థిర జీవనం కోసం భారత్ ముందంజలో ఉన్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇది నిజంగా ఉత్తేజకరమైన సమయం’’ అని అన్నారు. చంద్రుడి అన్వేషణపై ఉత్సాహంతో ఈ ల్యాండింగ్ నుంచి వెలువడే శాస్త్రీయ పరిశోధన, రోవర్ నమూనాలు తీసుకోవడం చూడటానికి తాను ఎదురు చూస్తున్నానని, ఇది ఒక గొప్ప అడుగు అని ఆమె అన్నారు. నాసాతో కలిసి అంతరిక్ష యాత్రలకు ప్రసిద్ధి చెందిన ఈ భారతీయ అమెరికన్ వ్యోమగామి విలియమ్స్.. ప్రజ్ఞాన్ రోవర్ దిగిన తర్వాత దాని అన్వేషణ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

రష్యాకు చెందిన లూనా-25 విమానం ల్యాండింగ్ కు కొన్ని రోజుల ముందు చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజులకే భారత్ మూన్ మిషన్ చంద్రయాన్ -3 జాబిల్లిపై అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. అందుకే అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, మాజీ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ అవతరించనుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్, రోవర్ విక్రమ్, ప్రజ్ఞాన్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకనున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu