గేట్ తీయనన్న గేట్‌మ్యాన్.. రెండు చేతులు నరికేసిన దుండగులు

Published : Sep 18, 2018, 01:27 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
గేట్ తీయనన్న గేట్‌మ్యాన్.. రెండు చేతులు నరికేసిన దుండగులు

సారాంశం

మనుషుల్లో నానాటికి అసహనం పెరిగిపోతోంది. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ తీయను అన్న పాపానికి ఓ గేట్‌మ్యాన్‌ చేతులు నరికేశారు గుర్తు తెలియని దుండగులు. 

మనుషుల్లో నానాటికి అసహనం పెరిగిపోతోంది. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ తీయను అన్న పాపానికి ఓ గేట్‌మ్యాన్‌ చేతులు నరికేశారు గుర్తు తెలియని దుండగులు. ఉత్తర ఢిల్లీలోని గేటు నంబర్-19 వద్ద కుందన్ పాఠక్ నరేలా అనే వ్యక్తి గేటు మ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఈ క్రమంలో అర్థరాత్రి దాటిన తర్వాత అర్థరాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు తాము త్వరగా వెళ్లాలని.. గేటు తీయాలని పాఠక్‌పై ఒత్తిడి చేశారు... అయితే ఆ సమయంలో మూరీ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండటంతో గేటు తీసేందుకు పాఠక్ నిరాకరించాడు.

తమ మాటకే ఎదురు చెబుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దుండగులు.. కుందన్‌పై కత్తితో దాడి చేసి చేతులు నరికేశారు. మెడ, కాళ్లపై తీవ్రంగా విచక్షణారహితంగా నరికేశారు. వెంటనే తోటి సిబ్బంది అతన్ని రోహిణి ఆస్పత్రికి తరలించడంతో.. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా చేతులను అతికించారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌