
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ జిల్లాలో షహీద్ గుర్దాస్ రామ్ మెమోరియల్ గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ (గర్ల్స్) ఉన్నది. ఈ స్కూల్ జిల్లాలోని 56 పాఠశాలల్లో 48వ ర్యాంక్ ఉండేది. ఇప్పుడు ఆ స్కూల్ నెంబర్ వన్ పొజిషన్‌కు వెళ్లింది. స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ మెరిట్ లిస్టులో ఈ స్కూల్ పిల్లల పేర్లు కనిపించాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పట్టుపట్టాడు. విద్యార్థులను అటు వైపుగా ప్రోత్సహించారు. వ్యక్తిగతంగానూ డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. ఫలితంగా.. ఇప్పుడు ఆ స్కూల్ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. పదో తరగతి, 12వ తరగతికి చెందిన ఇద్దరు పిల్లలు మెరిట్ లిస్టులో చోటు సంపాదించారు. దీంతో ఆ విద్యార్థులు ముందుగానే కోరుకున్నట్టు ప్రిన్సిపాల్ సొంత ఖర్చులతో వారిని ఫ్లైట్ ఎక్కించాడు. ఇప్పుడు ఆ స్కూల్‌లో మెరిట్ లిస్టులో పేరు సంపాదించాలని విద్యార్థుల్లో కసి పెరిగింది.
తాను ప్రిన్సిపాల్‌గా ఉన్న స్కూల్ నుంచి విద్యార్థుల పేర్లు మెరిట్ లిస్టులో ఉండాలని ప్రిన్సిపాల్ రాకేశ్ శర్మకు చాన్నాళ్ల నుంచి వెంటాడుతున్న కోరిక. గత 12 ఏళ్ల ఈ కోరికను విద్యార్థులు తీర్చారు. దీంతో అతను సొంతంగా ఖర్చు పెట్టుకుని మరీ వారిని ఉచితంగా విమానాన్ని ఎక్కించి ఇద్దరిని గోవాకు, మరో ఇద్దరిని ఢిల్లీకి పంపాడు.
రాకేశ్ శర్మ ప్రకారం, పదో తరగతి, 12వ తరగతి పిల్లలు పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు మెరిట్ లిస్టులో గత 12 సంవత్సరాల నుంచి చోటు సంపాదించుకోలేకపోతున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నాడు. అందుకే విద్యార్థులు మరింత కష్టపడి చదవాలని సూచించాడు. అంతేకాదు, వారికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. మెరిట్ లిస్టులో పేరు సంపాదిస్తే వారు కోరుకున్నదాన్ని అందిస్తానని హామీ ఇచ్చాడు.
విమానంలో ప్రయాణించాలని విద్యార్థులు కోరుకున్నారని, అందుకు తాను సరే అని వాగ్దానం చేసినట్టు రాకేశ్ శర్మ తెలిపారు. ‘ఉదయం ప్రార్థనంలో నేను ఒక ప్రకటన చేశాను. పదో తరగతి, 12వ తరగతి పిల్లల్లో ఎవరు బోర్డ్ ఎగ్జామ్ మెరిట్ లిస్టులో పేరు సంపాదించినా.. ఇండియాలోని ఏ డెస్టినేషన్‌కైనా వారి ఇష్టం ప్రకారమే ఫ్లైట్‌లో జర్నీ చేసే కలను సాకారం చేస్తాను’ అని హామీ ఇచ్చాడు.
Also Read: కేరళ స్కూల్ డ్రాపౌట్.. ఇప్పుడు అమెరికా జడ్జీ.. ‘బీడీలు చుట్టిన రోజుల్లోనే నిర్ణయించుకున్నా..’
ఈ స్కూల్‌లోని చాలా మంది పిల్లలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే.
‘దేవుడి దయ వల్ల నలుగురు విద్యార్థులు (ఇద్దరు పదో తరగతి, ఇద్దరు 12వ తరగతి) మెరిట్ లిస్టులో చోటు సంపాదించుకున్నారు. 12వ తరగతికి చెందిన భజన్‌ప్రీత్ కౌర్, సిమ్రన్‌జీత్ కౌర్‌లు అమృత్‌సర్ నుంచి గోవాకు గతేడాది నవంబర్‌లో వెళ్లారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్‌పో గోవాకు హాజరయ్యారు’ అని వివరించారు.
మరరో ఇద్దరు పిల్లలు ఈ నెల చివరి వారంలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌లో వెళ్లనున్నారు. వారు రాష్ట్రపతి భవన్, రెడ్ ఫోర్ట్, ఢిల్లీలోని ఇతర ప్రాంతాలు పర్యటిస్తారని ప్రిన్సిపాల్ రాకేశ్ శర్మ తెలిపారు.
ఫ్లైట్ ప్రయాణం పాపులర్ కావడంతో మరో 22 మంది విద్యార్థులు తాము కచ్చితంగా మెరిట్ లిస్టులో ప్లేస్ సాధిస్తామని రిజిస్టర్ చేసుకున్నారని, ఒక వేళ వారు సాధించినా తన కమిట్‌మెంట్‌కు కట్టుబడే వారినీ కూడా ఫ్లైట్ ఎక్కిస్తానని వివరించారు. ఇప్పుడు స్కూల్‌లో మెరిట్ పొజిషన్‌ను ఫ్లైట్ జర్నీతో పోల్చుకుంటున్నారని తెలిపారు.